IRGC Attacks: హర్మూజ్‌ జలసంధిలో గందరగోళం.. భారతీయ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్

హర్మూజ్‌ జలసంధిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ నౌకల్లో ఓ భారతీయ నౌక కూడా ఉండటం కలకలం రేపుతోంది.

New Update
IRGC Attacks Ships in Strait of Hormuz, Indian Vessel Caught in Crossfire

IRGC Attacks Ships in Strait of Hormuz, Indian Vessel Caught in Crossfire

హర్మూజ్‌ జలసంధి(Hormuz) లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. డా ఉండటం కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే..  దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టు నుంచి గుజఅయితే ఈ నౌకల్లో ఓ భారతీయ నౌక కూరాత్‌ పోర్టుకు వెళ్తున్న భారతీయ చమురు నౌక హర్మూజ్ జలసంధి దాటుతున్న సమయంలో ఇరాన్ IRGC దళాలు అడ్డుకున్నాయి.  

Also Read: పరువు తీసేశారు.. విదేశీ హోటల్‌లో వస్తువులు దొంగిలిస్తూ పట్టుబడ్డ భారతీయులు

IRGC Attacks Ships In Strait Of Hormuz

సముద్ర నిబంధనలను ఆ నౌకలు ఉల్లంఘించాయని ఆరోపిస్తూ IRGC తమ కంట్రోల్‌లోకి తీసుకొంది. ఆ తర్వాత ఇరాన్(iran) తీరానికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురులో 20 శాతం వాటా హర్మూజ్‌ జలసంధి గుండానే వెళ్తుంది. దీనిపై ఇరాన్ పట్టుబిగించడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కొన్ని నౌకలపై కూడా అక్కడ దాడులు జరిగాయి. తాజాగా భారతీయ నౌకను కూడా దిగ్బంధించి ఇరాన్‌కు తరలించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. డేటింగ్ చేస్తే రూ.12 వేలు ఆర్థిక సాయం

IRGC దళాలు భారతీయ నౌకను స్వాధీనం చేసుకోవడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇరాన్ దౌత్యవేత్తలతో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతోంది. అయితే సిబ్బంది క్షేమంగానే ఉన్నట్లు సమాచారం అందుతోంది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరాల్సిన ఈ చమురు నౌక నిలిచిపోవడంతో దేశీయంగా ఇంధన నిల్వలపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అందుకే భారత్‌ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల ఇప్పటికే హర్మూజ్‌ రూట్‌లో ప్రయాణించే నౌకల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం అక్కడ వాణిజ్య నౌకలకు భద్రత లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది.  

Advertisment
తాజా కథనాలు