America-Iran: అటు ట్రంప్‌ హెచ్చరికలు..ఇటు క్షిపణులతో ఇరాన్‌...!

అణ్వాయుధాల అభివృద్ధి విషయంలో ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్‌ పై బాంబు దాడులకూ వెనుకాడేది లేదని ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు.దీంతో అప్రమత్తమైన టెహ్రాన్‌..క్షిపణులతో సిద్ధమైనట్లు తెలుస్తోంది.

New Update
iran

iran

America-Iran: అణ్వాయుధాల అభివృద్ధి విషయంలో ఇరాన్ -అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి.అణు ఒప్పందం విషయంలో అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ టెహ్రాన్‌ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్‌ పై బాంబు దాడులకూ వెనుకాడేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.దీంతో అప్రమత్తమైన టెహ్రాన్‌..క్షిపణులతో సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also Read:Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ ఉగాది పోస్టర్ చూసారా..? పవర్‏ఫుల్ లుక్‏లో అదరకొట్టిన DCM

ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.ఇరాన్ వ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో క్షిపణులను లాంచ్‌ప్యాడ్‌ లపై సిద్ధంగా పెట్టినట్లు టెహ్రాన్ టైమ్స్‌ కథనం వెల్లడించింది. వైమానిక దాడుల కోసం వీటిని ప్రయోగించే అవకాశాలున్నట్లు తెలిపింది.అత్యవసర పరిస్థితులు ఎదురైతే అమెరికా సంబంధిత ప్రాంతాలపై దాడులు చేసేందుకు వీటిని ఉపయోగించనున్నట్లు సదరు కథనం పేర్కొంది.

Also Read: Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండ చరియలు..ఆరుగురు మృతి

అణు ఒప్పందం విషయంలో అగ్రరాజ్యం ప్రత్యక్ష చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజిష్కియాన్‌ తెలిపారు. పరోక్ష మార్గంలో చర్చలు జరిపేందుకు సిద్ధమని చెప్పారు. దీని పై ట్రంప్‌ మీడియా సంస్థతో మాట్లాడుతూ టెహ్రాన్‌ పై బెదిరింపులకు దిగారు. 

నిరాకరిస్తే... దాడులు తప్పవు..!

ఒకవేళ అణుఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్‌ నిరాకరిస్తే...ఆంబుదాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవిజరుగుతాయి.అదే విధంగా మరోవిడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు.అయితే ఇరాన్‌ తో పరోక్ష చర్చలకు అంగీకరిస్తారా? లేదా అనే దాని పై మాత్రం ట్రంప్‌ స్పష్టతనివ్వలేదు. ట్రంప్‌ తొలి హయాంలో ఇరాన్‌ తో సంబంధాలు అంతంతమాత్రంగానే సాగాయి. 

ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018 లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్‌ పై ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి.ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్‌ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు.

Also Read: Naxalites : మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు!

Also Read: Bishnoi Gang: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

trump | america | iran | tehran attack | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment