/rtv/media/media_files/2026/02/26/modi-and-netanyahu-2026-02-26-18-24-13.jpg)
Modi and Netanyahu
ప్రధాని మోదీ(PM Modi) ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సంగతి తెలసిందే. ఈ సందర్భంగా భారత్-ఇజ్రాయెల్ మధ్య కీల ఒప్పందాలు కుదిరాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు వ్యవసాయ రంగాల్లో పలు ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు కూడా తుది దశకు చేరుకున్నాయి. మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా క్షిపణులు, డ్రోన్ల సాంకేతికత బదిలీపై ఒప్పందం జరిగింది.
Also Read: Holi రష్.. ట్రైన్ టికెట్ దొరకదు.. బస్సు రేటు తగ్గదు.. చుక్కలు చూస్తున్న ప్రయాణికులు!
India-Israel Sign Key Agreements
ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌లో ఉమ్మడి పరిశోధనల కోసం ఒప్పందం కుదిరింది. భారత యూపీఐ సేవలు ఇజ్రాయెల్‌లో కూడా వినియోగించేలా అంగీకారం కుదిరింది. ఇక సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు, సమాచార మార్పిడి కోసం ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఇరుదేశాల మధ్య 100 ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి.
Also Read: ఇరాన్‌పై అమెరికా యుద్దం ఇక్కడి నుంచే.. ఇజ్రాయెల్‌కు చేరుకున్న పన్నెండు F-22 ఫైటర్ జెట్లు
ఇదిలాఉండగా ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ సోషల్ మీడియా ట్రెండ్స్‌లో మోదీ టాప్ 3లోకి వచ్చి రికార్డు సృష్టించారు. మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగింపు సందర్భంగా అక్కడి ప్రధాని బెంజమిన్ నేతన్యాహు(netanyahu) కూడా ప్రసంగించారు. ఈ పర్యటన కేవలం రెండు దేశాల మధ్య ఒప్పందాలకు పరిమితం కాదని రెండు మహత్తర మేధస్సులు, హృదయాలు కలిసిన సందర్భమంటూ పేర్కొన్నారు.
Follow Us