/rtv/media/media_files/2026/04/04/how-iran-downed-2-us-fighter-jets-2026-04-04-15-05-40.jpg)
How Iran Downed 2 US Fighter Jets, know details
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్(israel) దాడులు చేస్తుండగా.. ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, చమురు కేంద్రాలపై విరుచుకుపడుతోంది. అయితే గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్.. అమెరికాకు చెందిన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలను నేలకూల్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని ఇరాన్ దళాలు టార్గెట్ చేసి ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో ఓ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
మరోవైపు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు చెందిన మరో A-10 వార్తాగ్ ఎటాక్ విమానాన్ని కూడా ఇరాన్.. క్షిపణులతో దాడి చేసి నేలకూల్చింది. ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇరాన్ ఎలా దాడులు చేసింది ?
వాస్తవానికి అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడుల వల్ల ఇరాన్ రాడార్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి(US Fighter jet crash). అయినప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గలేదు. EO/IR (Electro-Optical/Infrared) సెన్సార్లను ఉపయోగించి ఈ దాడులు చేసింది. కేవలం విమాన ఇంజిన్ల నుంచి వచ్చే వేడిని గుర్తించి క్షిపణులను ప్రయోగించడంతో అమెరికా విమానాలు వీటిని గుర్తించలేకపోయాయి. ఈ 'పాసివ్ సెన్సార్' టెక్నాలజీ వల్ల ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్స్ శత్రువులకు కనిపించకుండా రహస్యంగా దాడులు చేస్తున్నాయి.
How Iran shot down a US F-15 fighter jet? NDTV's @VishnuNDTV has all the details pic.twitter.com/tuafMGe0AT
— NDTV (@ndtv) April 4, 2026
Also Read: బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో తొమ్మిది మంది మృతి!
మజీద్ (AD-08)మిస్సైల్ సిస్టమ్
ఇరాన్ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన 'మజీద్' (AD-08) క్షిపణి వ్యవస్థ ఈ దాడుల్లో కీలక పాత్ర పోషించింది. గగనతలంలో తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చివేసేందుకు దీన్ని రూపొందించారు. ఇది రాడార్ తరంగాలను రిలీజ్ చేయదు. అందుకే వీటిని గుర్తించడం కష్టం. 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలపై వేగంగా దాడులు చేయగలదు. ఒకేసారి నాలుగు టార్గెట్‌లను ట్రాక్ చేయగల సామర్థ్యం క్షిపణి వ్యవస్థకు ఉంది. అందుకే ఇరాన్ తన గగనతలాన్ని రక్షించుకోగలుగుతుంది.
సాధారణంగా F-15E లేదా A-10 లాంటి విమానాల్లో అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉంటాయి. ఇవి వేడిని తగ్గించే సాంకేతికతను, మిస్సైల్స్ దారి మళ్లించే 'ఫ్లేర్స్'ను వినియోగిస్తాయి. అయినప్పటికీ ఇరాన్ సైన్యం.. విమానాలు తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు లేదా పైలట్లు అప్రమత్తంగా లేని టైమ్‌లో దాడులు చేశాయి. ఇరాన్‌లో అమెరికా విమానాలు కూలిపోవడం ప్రపంచ దేశాలకు షాకిచ్చాయి. దీన్నిబట్టి ఆ ప్రాంతంపై అమెరికాకు పూర్తి నియంత్రణ లేదని తెలుస్తోంది.
Also Read: ట్రంప్ ఒక పిచ్చివాడు.. అమెరికా మాజీ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
మార్చి నుంచి ఇరాన్ వరుసగా అమెరికా, ఇజ్రాయెల్ డ్రోన్లను టార్గెట్ చేస్తోంది. గత నెలలో అనేక ఇజ్రాయెల్ హెర్మెస్ డ్రోన్లను ఇరాన్ కూల్చివేసింది. అలాగే అమెరికాకు చెందిన పలు MQ-9 రీపర్ డ్రోన్లను సైతం ధ్వంసం చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ రిపోర్టు ప్రకారం.. ఈ యుద్ధంలో అమెరికా ఇప్పటిదాకా 13,000 మిషన్లను నిర్వహించింది. 12,300 టార్గెట్‌లపై దాడులు చేసింది. ఇంతటి భారీ స్థాయిలో దాడులు జరిగినా కూడా.. ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎదురుదాడులు చేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత మరింత ముదురుతోంది.
Follow Us