బ్రిటన్‌‌కు ‘హిందూత్వం’ ముప్పు.. సంచలన రిపోర్ట్

బ్రిటన్‌లో హిందూజాతియవాదం ప్రభుత్వానికి ప్రమాదమని ఓ కమిషన్ ఇచ్చిన నివేదికలో లీక్ అయ్యింది. 9 తీవ్రవాద కార్యకలాపాల నుంచి బ్రిటన్ కు ముప్పు ఉందని హోమ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ యివెట్ కూపర్ వెల్లడించారు. అందులో హిందూ జాతీయవాదం, ఖలీస్థాన్ తీవ్రవాదం ఉన్నాయట.

author-image
By K Mohan
New Update
Hinduism in Britain

Hinduism in Britain Photograph: (Hinduism in Britain)

ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు పొందిన బ్రిటన్ ఇప్పుడు 9 సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. అందులో ఒకటి హిందూ జాతీయ వాదమని తెలుస్తోంది. ఖలిస్తానీ తీవ్రవాదం, హిందూ జాతీయవాదం ఇంగ్లాండ్ దేశానికి ప్రమాదంగా మారుతుందని బ్రిటన్ హోం శాఖ ఆధ్వర్యంలో చేసిన సర్వేలో తేలింది. హిందుత్వాన్ని బ్రిటన్ ఎందుకు ప్రమాదంగా భావిస్తోంది? అక్కడ హిందువుల జనాభా ఎంత? బ్రిటన్‌లో హిందూముస్లీం ఘర్షణలు ఎందుకు అవుతున్నాయని ఇప్పుడు తెలుసుకుందాం..

అనువుగాని చోట అధికులమనరాదు.. అంటే చుట్టు ఉండేవాళ్లు, ఆ ప్రాంతం మనిది కానప్పుడు తగ్గిఉండటమే మంచిదని అర్థం. ప్రస్తుతం బ్రిటన్‌లో హిందువుల పరిస్థితి కూడా అంతే ఉంది. ఖలిస్థాన్ తీవ్రవాదం విదేశాల నుంచి భారత్‌పై నిప్పులు కక్కుతుండగా.. బ్రిటన్‌లో కూడా ఏర్పాటువాదుల సిక్కు జనాభా ఎక్కువే. ఇంగ్లాడ్‌కు హిందుత్వంతోపాటు, ఖలిస్థాన్ తీవ్రవాదం కూడా ప్రమాదమని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది. 2024 వేసవిలో హిందూముస్లీంల మధ్య జరిగిన అల్లర్లను దృ‌ష్టిలో పెట్టుకొని బ్రిటన్ హోం సెక్రెటరీ రాపిడ్ ఎనలిటికల్ స్ర్పింట్ అనే కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ప్రివెంట్, రీసెర్చ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ యూనిట్ మరియు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, హోం మంత్రిత్వ శాఖలోని వివిధ సంస్థలు కలిసి ఓ నివేదికను రూపొందించాయి. అందులో బ్రిటన్‌కు 9 రకాల తీవ్రవాదాల నుంచి ప్రమాదం ఉందని తెలిసింది. వీటిలో ఇస్లామిస్ట్, తీవ్రవాద, మహిళా వ్యతిరేకత, ఖలిస్థాన్ అనుకూల తీవ్రవాదం, హిందూ జాతీయవాద తీవ్రవాదం, పర్యావరణ తీవ్రవాదం, తీవ్ర వామపక్షం, అరాచకవాదం లాంటివి ఉన్నాయట. హోం మంత్రిత్వ శాఖ నుంచి ఈ డాక్యుమెంట్ లీక్ అయింది. 

యూకేలో 15 లక్షల మంది ఇండియన్స్ ఉన్నాయి. వారిలో దాదాపు 10 లక్షల మంది హిందువులు కాగా.. మరో ఐదు లక్షల మంది సిక్కులు. హిందూ జాతీయవాదం, ఖలిస్తానీ తీవ్రవాదం బ్రిటన్‌కు కొత్త ముప్పు అని UK ప్రభుత్వ నుంచి విడుదలైన డాక్యుమెంట్‌లో వెల్లడైంది. ఇండియా-పాకిస్తాన్ ఆసియా కప్ 2022 మ్యాచ్ తర్వాత ఆగస్టు 28న దక్షిణాసియాకు చెందిన హిందువులు, బ్రిటిష్ ముస్లింల మధ్య ఘర్షణలు చెలరేగాయి. 2022లో కూడా లీసెస్టర్ అల్లర్లకు హిందూ జాతీయవాదమే కారణమని చెప్పింది బ్రిటన్ గవర్నమెంట్. 2024లో కూడా బ్రిటన్ లో అక్కడక్కడ హిందూముస్లిం అల్లర్లు జరిగాయి. 

ఖలిస్థాన్ మద్దతుదారులు తమ ప్రయోజనాల కోసం బ్రిటన్‌లో హింస వ్యాప్తి చేయడంపై సర్వేలో ఆందోళన వ్యక్తం చేసింది. ఖలిస్తానీ ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తులు ముస్లిం వర్గాలను కించపరిచేలా సందేశాలను వ్యాప్తి చేశారని ఈ నివేదిక చెబుతుంది. ముఖ్యంగా కెనడా, అమెరికాలో సిక్కులపై హిందువులు హింసకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఈ నివేధిక బ్రిటన్‌ను అలర్ట్ చేస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు