/rtv/media/media_files/2026/04/13/gulf-countries-2026-04-13-12-53-26.jpg)
Gulf countries Turn Away From U.S. for Fresh Ammunition
అమెరికా, ఇరాన్‌ల మధ్య రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. కానీ గల్ఫ్ దేశాల్లో మాత్రం అభద్రత నెలకొంది. ఇరాన్ ఏ క్షణం, ఎక్కడ దాడులు చేస్తుందో అనేదానిపై ఆందోళన ఉంది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా, UAE, ఖతార్ లాంటి దేశాలు కీలక నిర్ణయానికి వచ్చాయి. తమ రక్షణ అవసరాల కోసం ఎల్లప్పుడూ అమెరికాపై ఆధారపడకూడదని నిర్ణయించాయి. ప్రస్తుతం అమెరికా ఆయుధ పరిశ్రమలో ఉన్న సరఫరా జాప్యం, ఉత్పత్తి తగ్గిన కారణంగా గల్ఫ్ దేశాలు ఇప్పుడు దక్షిణ కొరియా, ఉక్రెయిన్ లాంటి దేశాల వైపు చూస్తున్నట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' కథనం వెల్లడించింది.
ప్రస్తుతం ఇరాన్ ప్రయోగిస్తున్న చౌకైన డ్రోన్లను ఎదుర్కొనేందుకు అమెరికాకు చెందిన ఖరీదైన పేట్రియాట్ మిస్సైల్స్‌ను వాడటం గల్ఫ్ దేశాలకు భారంగా మారుతోంది. అందుకోసమే దీనికి ప్రత్యామ్నాయంగా.. దక్షిణ కొరియాకు చెందిన M-SAM క్షిపణి రక్షణ వ్యవస్థల కోసం సౌదీ అరేబియా చర్చలు చేస్తోంది. డ్రోన్లను సమర్థవంతంగా కూల్చివేయగల ఈ సిస్టమ్ UAE ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. మరోవైపు బ్రిటన్‌కు చెందిన పలు స్టార్టప్ కంపెనీల నుంచి కూడా తక్కువ ధరకే చిన్న తరహా క్షిపణులను కొనుగోలు చేయాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌పై జరిపిన మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, చమురు కేంద్రాలపై దాడులు చేశాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, UAE లోని చమురు క్షేత్రాలు, పౌర మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడులు జరిగాయి. అలాగే యూఏఈలోని బూర్జ్ ఖలీపా సమీపంలో క్షిపణుల శకలాలు పడటం ఆందోళనకు గురిచేసింది. ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గల్ఫ్ దేశాలపై దాడుల చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఆ దేశాలు అభద్రతా భావానికి గురయ్యాయి. అందుకే కేవలం అమెరికాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి.
Also Read: మాకు మంత్రి పదవులు కావాల్సిందే.. ఢిల్లీకి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు ఇప్పటికే ఉక్రెయిన్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తాజాగా ఖతార్ అధికారులు ఉక్రెయిన్ శిక్షణ కేంద్రాలను సందర్శించారు. అక్కడ వాడుతున్న ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు, ఇంటర్‌సెప్టర్ల డ్రోన్ల టెక్నాలజీని పరిశీలించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ తన సొంత అవసరాల కోసం ఆయుధాలను ఎగుమతి చేయడం లేదు. కానీ భవిష్యత్తులో చూసుకుంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునే దిశగా ఈ దేశాలు ముందుకెళ్తున్నాయి.
మరోవైపు ఇటీవల అమెరికా UAE, కువైట్ లాంటి దేశాలతో సుమారు 23 బిలియన్ డాలర్ల ఆయుధ ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ అవి డెలివరీ అయ్యేందుకు ఇంకొన్నేళ్లు సమయం పట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అమెరికా.. ఉక్రెయిన్ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుండటం వల్ల స్విట్జర్లాండ్ లాంటి దేశాలు కూడా తమ ఆర్డర్లను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి గల్ఫ్ దేశాలు తమ భద్రత కోసం కేవలం అమెరికాను మాత్రమే కాకుండా ఇతర దేశాల వైపు చూస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: చర్చలు జరుగుతుండగా నెతన్యాహు ఫోన్ చేసి చెడగొట్టాడు.. ఇరాన్ సంచలన ఆరోపణలు
Follow Us