General Dan Caine: ట్రంప్ కళ్లు తెరిపించిన ఆర్మీ ఆఫీసర్.. ఎవరీ జనరల్ డాన్ కేన్?

ఇరాన్‌పై యుద్ధం విషయంలో అమెరికా పైకి రోజురోజుకు రెచ్చిపోతున్నా.. ట్రంప్ లోలోపల మాత్రం వెనక్కు తగ్గాలనే అనుకుంటున్నాడు. గతంలో ఇరాన్‌ను లొంగదీసుకుంటామని, హర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని అన్న ట్రంప్ ఇప్పుడు మాట మార్చాడు.

New Update
_General Dan Caine

ఇరాన్‌పై యుద్ధం విషయంలో అమెరికా పైకి రోజురోజుకు రెచ్చిపోతున్నా.. ట్రంప్(47th us president donald trump) లోలోపల మాత్రం వెనక్కు తగ్గాలనే అనుకుంటున్నాడు. గతంలో ఇరాన్‌ను లొంగదీసుకుంటామని, హర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని అన్న ట్రంప్ ఇప్పుడు మాట మార్చాడు. కాస్త వెనక్కి తగ్గి హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న మిత్రదేశాల చమురు నౌకలను విడిపించబోమని ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్‌పై యుద్ధంలో తమకు సాయం చేయని దేశాలకు అమెరికా సాయం చేయదని ట్రంప్ ప్రకటించాడు. "మీ చమురును మీరే తెచ్చుకోండి" అంటూ మిత్రదేశాలకు షాకిస్తూ ఆయన చేసిన 'ట్రూత్ సోషల్' పోస్ట్ ఇప్పుడు  సంచలనంగా మారింది. హోర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా తన దూకుడును తగ్గించుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. అగ్రరాజ్యమని అన్నీ దేశ రాజకీయాల్లో వేలు పెట్టే ట్రంప్ ఇప్పుడు చేతులెత్తేశాడు. ట్రంప్ ఈ నిర్ణయం వెనుక ఓ ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ ట్రంప్ కళ్లు తెరిపించాడు. మనకు అవసరం లేని యుద్ధంలో విర్రవీగి నష్టపోవడం తప్ప, అమెరికాకు వరిగేది ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. ట్రంప్ అనూహ్య ప్రకటన వెనుక జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్(General Dan Caine) (అలియాస్ రైజిన్ కేన్) ఇచ్చిన ఒక పవర్‌ఫుల్ ప్రజెంటేషన్ ఉంది. హోర్ముజ్ జలసంధిలో అమెరికా పూర్తి సైనిక శక్తిని ఎందుకు వాడటం లేదని ట్రంప్ ప్రశ్నించగా, కేన్ వాస్తవ పరిస్థితులను వివరించారు.

ఆత్మహత్యతో సమానం: ఇరుకైన హోర్ముజ్ జలసంధిలో భారీ అమెరికా యుద్ధనౌకలను మోహరించడం ప్రమాదకరమని, ఇరాన్ పంపే చిన్నపాటి "ఆత్మహత్య పడవలు" లేదా రిమోట్ కంట్రోల్డ్ బాంబులు బిలియన్ డాలర్ల నౌకలను క్షణాల్లో నాశనం చేయగలవని ఆయన హెచ్చరించారు.
అమెరికా ఫస్ట్: అమెరికాకు చమురు కోసం ఈ మార్గంపై పెద్దగా ఆధారపడటం లేదని, దీనివల్ల చైనా, జపాన్ వంటి దేశాలకే ఎక్కువ నష్టమని కేన్ వివరించారు. మనకు అవసరం లేని యుద్ధం కోసం అమెరికా సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడం వృధా అని ఆయన వాదించారు.

Also Read :  పూటకో మాట రోజుకో వేషం.. ‘అపరిచితుడు’ సినిమా చూపిస్తున్న ట్రంప్

మిత్రదేశాలకు ట్రంప్ వార్నింగ్

జనరల్ కేన్ వాదనతో ఏకీభవించిన ట్రంప్, తన వైఖరిని మార్చుకున్నారు. "ఇరాన్ విషయంలో మాకు అండగా నిలవని దేశాలు తమ బాగోగులు తామే చూసుకోవాలి. అమెరికా ఇకపై ఉచితంగా రక్షణ కల్పించదు" అని స్పష్టం చేశారు. ఇకపై అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి వెళ్లకుండా, ఇరాన్ క్షిపణి స్థావరాలను దూరం నుంచే లక్ష్యంగా చేసుకునే వ్యూహాన్ని అనుసరించనుంది.

Also Read :  అమెజాన్‌పై ఇరాన్ మిస్సైళ్ల వర్షం.. గల్ఫ్‌లో స్తంభించిన క్లౌడ్ సేవలు!

ఎవరీ డాన్ కేన్?

F-16 విమానాలను నడపడంలో దిట్ట అయిన డాన్ కేన్, ఇరాక్ యుద్ధ అనుభవం ఉన్న సైనికుడు. ట్రంప్ నమ్మకాన్ని గెలుచుకున్న ఆయన, ఇప్పుడు అమెరికా రక్షణ వ్యూహాలను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికా ప్రయోజనాలే పరమావధిగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ భౌగోళిక రాజకీయాలను మలుపు తిప్పనుంది.

Advertisment
తాజా కథనాలు