/rtv/media/media_files/2025/04/01/qcLnO3DVoAevXOAtlJvi.jpg)
france
యూరోపియన్ యూనియన్ నిధుల్ని దుర్వినియోగం చేసినట్లు ఫ్రాన్స్‌లోని అతివాద నేషనల్ ర్యాలీ పార్టీకి చెందిన మారిన్ లీపెన్‌పై ఆరోపణలు వినపడుతున్నాయి. అయితే ఈ కేసులోనే పారిస్ కోర్టు విచారణ జరపగా.. ఆమెపై 5 ఏళ్ల నిషేధం విధిస్తూ తీర్పునిచ్చింది. న్యాయమూర్తి తీర్పును పూర్తిగా చదవకముందే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నిషేధంతో ఆమె రాబోయే అధ్యక్ష రేసుకు దూరం కాబోతున్నారు.
Also Read: Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
2027లో జరగబోయే ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఈమె గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని అంతా అనుకుంటుండగా.. ఇలా జరగడంతో మారిన్ లీపెన్ మద్దతు దారులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఫ్రాన్స్‌లోని అతివాద నేషనల్ ర్యాలీ పార్టీకి చెందిన క్యాండిడేట్ లీపెన్ వయసు 56 సంవత్సరాలు. అయితే ఈమె గత ఎన్నికలు అయినటువంటి 2017, 2022 సంవత్సరాల్లో ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా చివరగా చేసిన పోటీలో ఎమ్మాన్యువల్ మాక్రన్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
లీపెన్‌ను అతివాద నేతగా ఆమె విమర్శకులు పిలుస్తూ ఉంటారు. ఈయూ విధానాలను ఆమె అనేక సందర్భాల్లో వ్యతిరేకించారు.ఇదిలా ఉండగా.. 2004 సంవత్సరం నుంచి 2016 వరకు పార్టీ సిబ్బందికి జీతాలు చెల్లించడానికి పార్లమెంటరీ సహాయకుల కోసం ఉద్దేశించిన 33 లక్షల డాలర్ల నిధులను దారి మళ్లించినట్లు మారిన్ లీపెన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఈమెతో పాటు మరో 8 మంది ఈయూ పార్లమెంట్ సభ్యులు కూడా నిందితులుగా ఉన్నారు. అయితే నేడు విచారణ జరిపిన పారిస్ కోర్టు.. లీపెన్ ఈ కేసులో కీలకంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ డబ్బు తన సొంత అవసరాలకు వాడుకోక పోయినప్పటికీ.. దీని వల్ల పార్లమెంట్ మరియు ఓటర్లను తప్పుదారి పట్టించినట్లుగా అభివర్ణించింది. అందుకే 5 ఏళ్ల నిషేధం విధించింది. కనీసం ఆమె ఈ 5 సంవత్సరాల నిషేధంపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు సదరు న్యాయస్థానం. ముఖ్యంగా 5 ఏళ్ల నిషేధం అనగానే.. అద్భుతం అంటూ గొణిగిన లీపెన్... జడ్జి పూర్తి తీర్పును చదవకముందే కోర్టు నుంచి వెళ్లిపోయారు. వెంట తెచ్చుకున్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని చాలా కోపంగా బయటకు నడిచారు. ఆపై కారులో ఎక్కబోతుండగా.. మీడియా ఆమెను ప్రశ్నించబోయింది. కానీ ఆమె ఎలాంటి సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఐదేళ్ల నిషేధం వల్ల ఆమె రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడబోతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!
france | elections | latest-news | ban | telugu-news | latest-telugu-news | latest telugu news updates