పీటీఐ పార్టీ అధ్యక్షుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి బిగ్ షాక్ తగిలింది. భూ అవినీతి కేసులో స్థానిక కోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇమ్రాన్‌తో పాటు అతని భార్య బుష్రా బీబీకి కూడా కోర్టు 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది.
ఇది కూడా చూడండి: ఖేల్ రత్న అవార్డ్‌లు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
Breaking News by @Matiullahjan919
— PTI USA Official (@PTIOfficialUSA) January 17, 2025
“Judge Nasir Javed Rana has strong tendencies to commit mischief. He is absolutely unfit for judicial service.” 21 years ago Pakistan’s Supreme Court ordered the removal of Nasir Javed Rana, the judge who sentenced Imran Khan to 14 years and… pic.twitter.com/Fz27q3hfIP
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్ ను పొడిచిన కత్తి ఇదే.. ఎంత లోతు దిగిందంటే?
అవినీతికి పాల్పడ్డారని..
భూ అవినీతి కేసు విషయంలోన ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైలులో ఉంటున్నారు. వివిధ కారణాలో ఈ కేసు మూడుసార్లు వాయిదా పడగా.. తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ కేసు విషయంలో ఇమ్రాన్ ఖాన్, అతని భార్యతో పాటు మరో ఆరుగురిపై కూడా నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో 2023లో కేసు నమోదు చేసింది. 50 బిలియన్ల పాకిస్తానీ రూపాయల అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. మిగతా వారంతా దేశానికి బయట ఉండటంతో వీరిపై విచారణ జరిపింది.
ఇది కూడా చూడండి: Arvind Kejriwal: ప్రధానిమోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?
2018 ఎన్నికల్లో పీటీఐ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా పదవి చేపట్టరు. అయితే 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో పదవి కోల్పోయారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన మీద దాదాపుగా 200 కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చూడండి:CM Revanth: రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్-PHOTOS