Turkey : నాటో దేశాలపై తొలి దాడి.. తుర్కియేపై బాలిస్టిక్ క్షిపణి అటాక్‌

తమ సుప్రీంను కోల్పొయినప్పటికీ ఇరాన్‌ ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలను టార్గె్‌ట్‌ చేసుకుని దాడులు నిర్వహిస్తోంది. పలు దేశాలపై క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ తాజాగా నాటో సభ్యదేశమైన తుర్కియే పై బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది.

New Update
FotoJet (12)

Ballistic missile

Turkey: ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడులతో తమ సుప్రీంను కోల్పొయినప్పటికీ ఇరాన్‌ ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలను టార్గె్‌ట్‌ చేసుకుని దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు దేశాలపై క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ తాజాగా నాటో సభ్యదేశమైన తుర్కియే పై బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది(ballistic missile attack). అయితే తుర్రియే వైపు దూసుకెళ్తున్న క్షిపణిని ముందే పసిగట్టిన నాటో ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ (NATO air and missile defence system) బుధవారం దాన్ని ధ్వంసం చేసింది. ఇరాన్‌ కు సంబంధించిన క్షిపణి సిరియా గగనతలం దాటి తుర్కియే వైపు వెళ్తుండటాన్ని  నాటో పసిగట్టింది. తూర్పు మధ్యధరా సముద్రంలో ఉన్న నాటో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సకాలంలో పసిగట్టింది. వెంటనే స్పందించి క్షిపణిని గగనతలంలోనే కూల్చివేసింది.  ఈ విషయాన్ని తుర్కియే రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తేల్చి చెప్పింది. 

కాగా ఈ విషయమై తుర్కియే స్పందించింది. తమ దేశ ప్రాదేశిక సమగ్రత, గగనతలాన్ని కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నామని రక్షణ శాఖ వెల్లడించింది. ప్రతికూల చర్యలకు ఎవరు పాల్పడినా తగిన విధంగా స్పందించే హక్కు తమకుందని హెచ్చరించింది. ఈ సందర్భంగా ఘర్షణలు మరింత ముదరకుండా సంబంధిత పక్షాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. - ballistic missile test

Also Read :  పాక్‌ ఎంబసీలు వదిలేయండి.. అమెరికా అప్రమత్తం

నాటో సభ్యదేశంపై తొలిదాడి

కాగా, తుర్కియేపై ఇరాన్(iran) దాడి చేయడాన్ని నాటో తీవ్రంగా పరిణిస్తోంది. ఇరాన్ గతంలో ఏనాడు తుర్కియేపై దాడిచేసిన దాఖలాలు లేవు. కానీ,  తాజా ఘర్షణల్లో ప్రధానంగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జరుపుతోందని తెలుస్తోంది. అయితే తాజాగా నాటో సభ్యదేశమైన తుర్కియే గగనతలం పైపు ఇరాన్ క్షిపణి ప్రయోగించడంతో నాటో కూడా రంగంలోకి దిగే అవకాశాలున్నాయనే అభిప్రాయానికి వ్యక్తమవుతోంది. నాటో నిబంధనల ప్రకారం ఏ ఒక్క నాటో సభ్యదేశంపై దాడి జరిగినా అది మొత్తం సభ్యదేశాలన్నింటిపై జరిపిన దాడిగా పరిగణిస్తాయి. తద్వారా నాటో దేశాలన్ని దాడి చేసిన దేశాలపై ప్రతిదాడి చేసే అవకాశం ఉంటుంది. కాగా ఇరాన్‌తో తుర్కియా 500 కిలోమీటర్లు సరిహద్దు కలిగి ఉంది.

Also Read :  ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి పాకిస్తాన్.. రంగంలోకి దిగేందుకు 5 కారణాలు!

Advertisment
తాజా కథనాలు