/rtv/media/media_files/2025/03/24/XPj9O91a0wjwFArxM7q5.jpg)
F1 Visa
అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని చాలామంది విద్యార్థులు అనుకుంటారు. ప్రతీఏడాది అనేక దేశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు అమెరికాకి వెళ్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటి వాళ్లకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికా ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన F1 వీసాలను భారీగా తిరస్కరిస్తోంది. గత ఆర్థిక ఏడాదిలో 41 శాతం వీసా అప్లికేషన్లను తిరస్కరించింది.
Also Read : అదృష్టం అంటే ఈ అమ్మాయిదే.. కొత్తగా కొన్న ప్యాంట్ జేబులో డబ్బే డబ్బు!
పదేళ్ల క్రితంతో పోలిస్తే F1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2023--24 ఆర్థిక ఏడాదిలో F1 వీసాల కోసం 6.79 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. కానీ ఇందులో దాదాపు 2.79 లక్షలు (41 శాతం ) దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.99 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 2.53 లక్షలు(36 శాతం) దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి.
Also Read: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్!
2013-2014 ఆర్థిక సంవత్సరంలో చూస్తే 7.69 లక్షల మంది విద్యార్థులు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1.73 లక్షల (23 శాతం) వీసా అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. అప్పటితో పోలిస్తే గతేడాది వీసా దరఖాస్తుల తిరస్కరణ సంఖ్య రెట్టింపు అయ్యింది. దేశాల వారీగా రిజెక్ట్ అయిన వారి సంఖ్యను అమెరికా సర్కార్ వెల్లడించలేదు. అయితే గతేడాది డిసెంబర్ 9 నాటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం 2024లో తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు F1 వీసాలు 38 శాతం తగ్గాయి. అయితే 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64 వేల మంది భారతీయ విద్యార్థులకు F1వీసాలు జారీ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉండటం గమనార్హం.
Also Read : అస్సలు ఊహించలేరు.. రూ.23వేలకే iPhone 16 బేస్ వేరియంట్- ఇంత చీప్ ఎలారా బాబు!
F1 వీసా అంటే ?
F1 వీసా అనేది నాన్‌ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ అమెరికాలో ఫుల్ టైమ్ విద్య అభ్యసించడం కోసం ఈ వీసా పర్మిషన్ ఇస్తుంది. అమెరికాలో విద్యాసంస్థలు ప్రతీ సంవత్సరం రెండుసార్లు ప్రవేశాలకు అనుమతినిస్తాయి. ఆగస్టు, డిసెంబర్ సమయంలోనే భారత విద్యార్థులు ఎక్కువగా యూఎస్‌కు వెళ్తుంటారు.
Also Read : వివేక్, బాల్క సుమన్ సీక్రెట్ మీటింగ్.. అసలేం జరుగుతోంది?
f1-visa | rtv-news | national-news | usa | student-visa | us-visa | international news in telugu | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu