/rtv/media/media_files/Im4K3O2M7sfd5gfohKJ6.jpg)
తాజాగా ప్రపంచాన్ని కుదిపేసిన ఏఐ టెక్నాలజీ డీప్ సీక్. చైనా వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ ఏఐ స్టార్టప్ తో అమెరికా కంపెనీలన్నింటినీ షేక్ చేసింది. దీని దెబ్బకు టెక్ దిగ్గజాల డబ్బులు ఉఫ్ మని పోయాయి. ఇందులో ప్రంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందరికంటే ఇతనికే పెద్ద దెబ్బ పడిందని సమాచారం. డీప్ సీక్ దెబ్బకు ఎలాన్ మస్క్ సంపద ఒక్క నెలలోనే 90 మిలియన్లు తగ్గిపోయింది. ఇతనితో పాటూ ఎన్విడియా, మెటా అధినేతల ఆస్తులు కూడా భారీగానే తగ్గాయని తెలుస్తోంది.
పాపం కుబేరులు..
నిజానికి ఈ ఏడాది మొదట్లో ప్రంచ ధనవంతుల ఆదాయాలన్ని భారీగా పెరిగింది అయితే ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవనివ్వలేదు చైనా ఏఐ డీప్ సీక్. దీని దెబ్బకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నికర సంపద 433 బిలియన్ డాలర్లు ఉండగా.. నెలాఖరు నాటికి 349 బిలియన్ డాలర్లకు తగ్గింది. అంటే దాదాపు 90 బిలియన్ డాలర్ల సంపదను ఆయన కోల్పోయారు. ఇక ఎన్విడియా సీఈఓ జేసెన్ హువాంగ్ సంపద 20 బిలియన్ డాలర్లు, మెటా సీఈఓ జుకర్‌బర్గ్ నికర ఆస్తులు దాదాపు 11 బిలియన్ డాలర్లు.. ఒరాకిల్ ఛైర్మన్ ల్యారీ ఎలిసన్ 27.6 బిలియన్ డాలర్లు.. గూగుల్ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ నికర సంపద 6.3 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల లిస్ట్ లో వారి స్థానాలు ఒకటి లేదా రెండు తగ్గిపోయాయి.
చైనాకు చెందిన డీప్‌సీక్ అనే స్టార్టప్ సంస్థ సంచలనం సృష్టించింది. తక్కువ ఖర్చు, హై- ఎఫీషియెన్సీ ఏఐ మోడల్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఈ ఏఐ అసిస్టెంట్ ఇప్పుడు చాట్‌జీపీటీని అధిగమించి అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్‌లో టాప్‌లో నిలిచింది. డీప్ సీక్ ను ఇతర ఏఐ మోడల్స్‌తో పోల్చితే.. ప్రాంప్ట్ కి సమాధానం ఇచ్చే ముందు రీజనింగ్ కూడా ఇస్తుండటం.. ఇతర మోడల్స్‌కి డీప్‌సీక్ ఆర్1కి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం. సక్సెస్ఫుల్ ఓపెన్ఏఐ టెక్నాలజీతో ఇది సమానంగా పనిచేస్తుందని సంస్థ చెబుతోంది.