/rtv/media/media_files/2026/04/22/fotojet-2026-04-22-13-34-59.jpg)
Donald Trump
Donald Trump : ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(america president donald trump) ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా(Social Media) వేదికగా చర్చ సాగుతోంది. ఆయన ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తమవుతుంది. ఇరాన్‌తో యుద్ధం వేళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలపై రకరకాల ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు చర్చనీయాంశమవుతుంటే, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం(donald trump health update) పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ట్రంప్‌ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోందని, ఆ ప్రభావం ఆయన శారీరక కదలికలపై పడిందని నెటిజన్లు వాదిస్తున్నారు. ట్విట్టర్ (X) ఇతర సామాజిక మాధ్యమాల్లో ట్రంప్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ప్రధానంగా కొన్ని అంశాలను ప్రస్తానిస్తున్నారు:
Also Read: ఇరాన్ మహిళలకు మరణశిక్ష... రంగంలోకి డొనాల్డ్ ట్రంప్.. ‘ట్రూత్ సోషల్’ వేదికగా భావోద్వేగ విజ్ఞప్తి
Donald Trump's Deteriorating Health Goes Viral
ట్రంప్ తన రెండు కాళ్ల మధ్య ఎక్కువ దూరం ఉంచి (Wide Gap) నిలబడుతున్నారని, ఆ సమయంలో ఆయన చేతులు అస్తవ్యస్తంగా వేలాడుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక వీడియో క్లిప్‌లో ట్రంప్ కాస్త కుంటుతూ నడుస్తున్నట్లు కనిపించడం చర్చకు దారితీసింది. శరీర సమతుల్యతను (Body Balance) కాపాడుకోవడంలో ఆయన ఇబ్బంది పడుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.79 ఏళ్ల వయసులో మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం, అదే సమయంలో యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
కేవలం వీడియోలు లేదా ఫోటోలను చూసి ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం సరైనది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై నిపుణుల విశ్లేషణ మరోలా ఉంది: వారి వివరణ ప్రకారం 79 ఏళ్ల వయసులో శరీరంలో స్వల్ప మార్పులు రావడం సహజం. నిటారుగా నడవలేకపోవడం లేదా శరీరం కొంచెం వంగడం ఈ వయసులో సాధారణమే. ఎక్కువ సమయం షూస్ ధరించడం వల్ల లేదా విమాన ప్రయాణాల వల్ల కాళ్లలో వాపు రావచ్చు, దీనివల్ల నడక మారే అవకాశం ఉంది. ఆర్థరైటిస్కీళ్ల నొప్పులు (Arthritis) ఉన్నవారిలో నిలబడే తీరు, నడకలో మార్పులు కనిపిస్తాయి.
అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ధుడైన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గతంలోనూ అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే, అధికారికంగా వైట్ హౌస్ నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రతికూల ప్రకటన రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కేవలం ప్రజల అంచనా మాత్రమేనని, క్లినికల్ పరీక్షలు లేకుండా ఏదైనా నిర్ధారించడం సాధ్యం కాదని స్పష్టమవుతోంది.
Also Read : హర్మూజ్ జలసంధిలో భారీ స్కామ్.. అధికారుల ముసుగులో కేటుగాళ్లు
Follow Us