/rtv/media/media_files/2025/01/20/SqaSIt3NEAUGSHndvPiU.jpg)
trump oth Photograph: (45521313212)
Donald Trump: అమెరికాలో ఇప్పుడిక స్వర్ణయుగం మొదలు కాబోతుందని నూతన అధ్యక్షుడు , రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతులను నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అక్రమ వలసలను అరికడతామని,దేశ దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ విధిస్తామని ప్రకటించారు. ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణం చేశారు.
Also Read: Attack on Dalits: దారుణం.. పనికి రానందుకు ముగ్గురు దళితులపై విచక్షణారహితంగా దాడి..
అధ్యక్ష బాధ్యతల్ని ఆయన స్వీకరించడం ఇది రెండోసారి. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు.తమ కుటుంబ బైబిల్ ను.1861 లో అమెరికా అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ ప్రమాణం చేసినప్పటి బైబిల్ ను చేతపట్టుకుని ఆయన దీనిని పూర్తి చేశారు.అనంతరం ఆయన ప్రసంగించారు. ఇక పై అమెరికా అన్ని రంగాల్లో వర్థిల్లుతుందని,ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ గౌరవం పొందుతుందని చెప్పారు.
Also Read: Meenakshi Chaudhary: ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయాలని ఉంది! ఇది నిజమేనా మీను..?
ఎవరూ తమను అలుసుగా తీసుకోలేరని,అందరికీ అసూయ కలిగించేలా ప్రస్థానం సాగిస్తామని తెలిపారు. అమెరికా ఫస్ట్ అనేది నినాదంగా దేశాన్ని అగ్రస్థానాన నిలబెడతానని ప్రతిన బూనారు.రాజ్యాంగ బద్దంగా,ప్రజాస్వామ్య యుతంగా పాలన అందిస్తాం.దేశంలోకి నేరగాళ్లు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. తీవ్రవాద కార్యకలాపాలను ఎంతమాత్రం సహించేది లేదు.
న్యాయం అందజేయడంలో సంతులనం సాధిస్తాం. న్యాయ విభాగంలో ,ప్రభుత్వంలో దుష్ట హింసాత్మక అనుచితమైన ఆయుధ పోకడకు తెరపడుతుంది.అమెరికాకు అత్యున్నత సేవలందించేందుకు పాటుపడతా. పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక చర్యలు తీసుకుంటా.రెస్టారెంట్లలో కాల్పుల వంటి ఘటనలు జరగకుండా నిలబెడతా.
ప్రతిభకు పెద్ద పీట...
శాంతి దూతగా,అందర్ని ఏకం చేసేలా ఉండాలని నేను భావిస్తున్నా.ప్రతిభకు పెద్ద పీట వేసి వివక్షకు తావులేని రీతిలో మా యంత్రాంగం ఉంటుంది. అమెరికా పౌరుల్ని సుసంపన్నుల్ని చేసేలా విదేశాల పై టారిఫ్ లు విధిస్తాం. అమెరికాలోకి ప్రమాదకరమైన నేరగాళ్లు చొరబడి ఆశ్రయం పొందేలా మునుపటి ప్రభుత్వం అవకాశం కల్పించింది. నా పై హత్యాయత్నాలు జరిగినా దేవుడు నన్ను కాపాడాడుజ
అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా చేయడానికి అవకాశం కల్పించాడు అని ట్రంప్ చెప్పారు. ఈ వేడుకను చూడడానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా.బుష్, క్లింటన్ లు వచ్చారు. వారిని చూస్తూనే సభలో కరతాళ ధ్వనులు మారు మోగాయి. తెలుగు మూలాలున్న ఉషను వివాహం చేసుకున్న జేడీ వాన్స్ కూడా ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేశారు.
తన పూర్వీకుల నుంచి వచ్చిన బైబిల్ సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. అధ్యక్షుడు ప్రమాణం చేస్తున్నప్పుడు భవనం బయట టపాసులు పేల్చారు.
Also Read: TG News: మందుబాబులకు మత్తెక్కించే వార్త.. KF మళ్లీ వచ్చేస్తోంది!
Also Read: Atul Subhash: అతుల్ సుభాష్ కేసులో కోర్టు సంచలన తీర్పు