/rtv/media/media_files/2026/02/04/trump-2026-02-04-19-41-50.jpg)
అమెరికా(america) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి వార్తల్లో నిలిచారు. వైట్ హౌస్(white-house) వేదికగా జరిగిన విలేకరుల సమావేశంలో తనను ప్రశ్నించిన రిపోర్టర్‌పై ఆయన విరుచుకుపడ్డారు. సదరు మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సింది పోయి, ఆమె వ్యక్తిత్వాన్ని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
CNN రిపోర్టర్ కేట్లన్ కాలిన్స్, జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక కుంభకోణానికి సంబంధించిన కొత్త ఫైళ్లపై ట్రంప్‌ను ఆమె ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో ఒక్కసారిగా అసహనానికి గురైన ట్రంప్.. "నీ ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉండదు. నిన్ను పదేళ్లుగా చూస్తున్నాను. నువ్వు నవ్వవు.. ఎందుకో తెలుసా? నువ్వు చెప్పేవి అన్నీ అబద్ధాలు కాబట్టి. మీది ఒక నిజాయితీ లేని సంస్థ. అలాంటి సంస్థలో పనిచేస్తున్నందుకు నువ్వు సిగ్గుపడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Can I suggest that journalist ask Trump the direct question.
— TheOrchids/ (@the0rchids) February 4, 2026
Is he a pedophile? https://t.co/V6Bd8IR1XA
Also Read : ట్రంప్ రూల్స్‌కు గూగుల్ రివర్స్ గేర్.. ఏకంగా 20 వేల ఉద్యోగాలు రెడీ బాస్!
ఇదేమీ మొదటిసారి కాదు
ట్రంప్ రిపోర్టర్లపై ఇలా విరుచుకుపడటం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు జర్నలిస్టులను కించపరుస్తూ మాట్లాడారు. 2025 నవంబర్ లో ఎప్స్టీన్ ఈమెయిల్స్ గురించి ప్రశ్నించిన బ్లూమ్‌బర్గ్ రిపోర్టర్ క్యాథరిన్ లూసీని అమాయకపు పందిపిల్ల అని సంబోధించి అవమానించారు. అదే సంవత్సరం సౌదీ యువరాజుతో భేటీ సమయంలో ఖషోగ్గి హత్య గురించి ప్రశ్నించిన ఏబీసీ న్యూస్ రిపోర్టర్ మేరీ బ్రూస్‌పై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తానని బెదిరించడం, కొన్ని ఛానళ్లను ఫేక్ న్యూస్ అని ముద్రవేయడం ట్రంప్‌కు అలవాటుగా మారింది. ట్రంప్ తీరును వైట్ హౌస్ ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. విలేకరులు ప్రశ్నలు అడగకుండా అడ్డుకోవడం, వారిని వ్యక్తిగతంగా దూషించడం పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమేనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు కూడా ప్రస్తావనకు రావడంతోనే ఆయన ఇంతలా సహనం కోల్పోతున్నారనే చర్చ నడుస్తోంది.
Also Read : మంచు దుప్పటి కప్పుకున్న నయాగారా జలపాతం.. ఇలా ఎందుకు మారిపోయిందో తెలుసా ?
Follow Us