Donald Trump: నావికాదళ కార్యదర్శిపై వేటు.. ఇరాన్ యుద్ధం వేళ ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్న సమయంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా నావికాదళ కార్యదర్శి జాన్ ఫెలాన్‌ను పదవి నుంచి తొలగిస్తూ ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

New Update
John Phelan

John Phelan

అమెరికా(america), ఇరాన్(iran) మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సమయంలో అమెరికా రక్షణ శాఖలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా నావికాదళ కార్యదర్శి జాన్ ఫెలాన్‌(US Navy Secretary John Phelan) ను పదవి నుంచి తొలగిస్తూ ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా నౌకాదళం సరైన రీతిలో స్పందించలేదన్న అసహనంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఫెలాన్ మాత్రమే కాకుండా మరో నలుగురు ఉన్నత స్థాయి సైనిక అధికారులను కూడా బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Britain: మధ్య ఆసియాపై కన్నేసిన బ్రిటన్.. రష్యా, చైనాలకు పోటీగా బిగ్ ప్లాన్

ఆధీనంలోకి మూడు నౌకలు

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దళాలు అమెరికా, ఇతర అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై నిరంతరం దాడులు చేస్తున్నాయి. ఇటీవలే ఇరాన్ మూడు నౌకలను తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ క్రమంలో అమెరికా రక్షణ వ్యూహాలు విఫలమవుతున్నాయని ట్రంప్(Donald Trump) యంత్రాంగం భావిస్తోంది. ముఖ్యంగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సైన్యంలో సమూల మార్పులు చేయడం ద్వారా ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు పంపాలని ట్రంప్ సర్కార్ యోచిస్తోంది.

ఇది కూడా చూడండి: కర్ణాటకలో దారుణం.. అమెరికా మహిళపై అత్యాచారం..

జాన్ ఫెలాన్ తొలగింపు వెనుక 'కాల్పుల విరమణ' ఒప్పందం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అమెరికా ప్రభుత్వం శాంతి చర్చలు జరుపుతున్నట్లు ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఇరాన్ దూకుడు తగ్గడం లేదు. అమెరికా నౌకాదళం తన శక్తిని నిరూపించుకోవడంలో వెనుకబడిందని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఏకంగా అమెరికా నౌకలపై కాల్పులు జరపడం అమెరికా ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని, అందుకే కఠిన నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం.

ఇది కూడా చూడండి: IRGC Attacks: హర్మూజ్‌ జలసంధిలో గందరగోళం.. భారతీయ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అమెరికా తన కొత్త అధికారుల నేతృత్వంలో ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగితే అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు సరఫరా ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. 

#telugu-news #america #Donald Trump #iran #latest-telugu-news #international news in telugu #US Navy Secretary John Phelan
Advertisment
తాజా కథనాలు