/rtv/media/media_files/2025/01/28/NY2ICuZYeNzs3sCQmbCr.jpg)
Deepseek
DeepSeek: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో AI స్టార్టప్ డీప్‌సీక్ తాజాగా సంచలనంగా మారింది. ప్రస్తుతం దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున జరుగుతోంది. ఇప్పటికే ఉన్నటువంటి ఓపెన్ ఏఐ(Open AI), గూగుల్ జెమిని(Google Gemini) వంటి దిగ్గజ సంస్థలకు ఇది పోటీగా నిలిచింది. ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్(OpenAI CEO Sam Altman) కూడా స్పందించారు. డీప్‌సీక్ బాగుందంటూ ప్రశంసించారు. మేము కూడా మరింత మెరుగైన మోడల్స్‌ను అందిస్తామంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
Also Read: వాటర్ బాంబ్ కు ధీటుగా..చైనా సరిహద్దుల్లో బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్
''ఇది నా పరిధి దాటిపోయిన అంశం"...
అయితే డీప్‌సీక్(DeepSeek)లో అరుణాచల్‌ప్రదేశ్ (Arunachal Pradesh)గురించి అడిగిన ఓ ప్రశ్నకు అది షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఆ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. డీప్‌సీక్‌లో రిజిస్టర్ చేసుకున్న ఓ యూజర్ అరణాచల్‌ప్రదేశ్ భారత్‌లో ఓ రాష్ట్రం అని టెప్ చేసి పంపారు. దీనికి స్పందించిన డీప్‌సీక్.. ''ఇది నా పరిధి దాటిపోయిన అంశం.. వేరే అంశం గురించి మాట్లాడుకుందామని'' సమాధానమిచ్చింది.
CCP machine exposed 🤣 https://t.co/DlmofSXQUP pic.twitter.com/TAggpM8L87
— ur rental friend☆ ragebait machine (@sxchidxnxnd) January 27, 2025
Also Read: గూగుల్ మ్యాప్స్‌లో మారిన గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు..కానీ అక్కడ మాత్రం!
ఆ తర్వాత యూజర్.. భారత్‌లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల పేర్లు చెప్పండి అని అడగగా డీప్‌సీక్ మళ్లీ అదే సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదిలాఉండగా.. ఆర్1 పేరిట తీసుకొచ్చిన ఏఐ మోడల్ డీప్‌సీక్ ఫ్రీగా అందుబాటులో ఉంది. చాట్ జీపీటీ(ChatGPT), క్లాడ్ సోనెట్ వంటి ఏఐ సంస్థలు సబ్‌స్క్రిప్షన్ రూపంలో కొంత వసూలు చేస్తుండగా.. డీప్‌సీక్ మాత్రం ఉచితంగా అందుబాటులో ఉండటంతో ఇది సంచలనంగా మారింది.
Also Read: యూపీలో పెను విషాదం.. లడ్డూల కోసం ఫైట్.. ఏడుగురి మృతి.. 60 మందికి సీరియస్
Also Read: డీప్‌సీక్ పనితీరు బాగుందన్న ఓపెన్ ఏఐ సీఈవో