Asim Munir: ఇరాన్‌కు సైనికుడిగా.. అమెరికాకు నాయకుడిగా.. మునీర్ 'డ్రెస్ కోడ్' వెనుక రహస్యం అదేనా..

శాంతి చర్చల కన్నా ముందుగా పాక్ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌ ధరించిన దుస్తులు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కన్నా అసిమ్ మునీర్ తన ఉనికిని బలంగా చాటుకుంటున్నారు. ఒకే రోజులో ఆయన రెండు విభిన్న దుస్తుల్లో కనిపించారు.

New Update
Asim Munir met Iran leaders in combat gear but JD Vance in a suit

Asim Munir met Iran leaders in combat gear but JD Vance in a suit

పాకిస్థాన్(pakistan) రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్(America-Iran) మధ్య మరికాసేపట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇరాన్ ప్రతినిధి బృందం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టీమ్ ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అయితే ఈ శాంతి చర్చల కన్నా ముందుగా పాక్ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌ ధరించిన దుస్తులు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. సాధారణంగా దేశాధినేతలు అతిథులకు స్వాగతం పలకాల్సి ఉండగా.. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కన్నా అసిమ్ మునీర్ తన ఉనికిని బలంగా చాటుకుంటున్నారు. ఒకే రోజులో ఆయన రెండు విభిన్న దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే దీని వెనుక లోతైన దౌత్య వ్యూహం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

Also read: చర్చలకు ముందే ఇరాన్ షరతులకు ఒప్పుకున్న అమెరికా..

Asim Munir Met Iran Leaders

ముందుగా ఇరాన్ ప్రతినిధి టీమ్ వచ్చినప్పుడు అసిమ్ మునీర్‌ పూర్తిగా సైనిక దుస్తుల్లో కనిపించారు. ఆ తర్వాత అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్‌ ల్యాండ్‌ అయ్యాక ఆయనకు స్వాగతం పలికేందుకు మునీర్‌ నల్లటి సూట్‌ ధరించి పక్కా రాజకీయ నేతగా దర్శనమిచ్చారు. ప్రస్తుతం క్షిపణి దాడులతో ఉద్రిక్తతలు ఉన్న ఇరాన్‌కు తన సైనిక శక్తిని గుర్తుచేసేందుకు మునీర్ యూనిఫాం ధరించినట్లు నిపుణులు భావిస్తున్నారు. అలాగే అమెరికా ప్రతినిధుల ముందు తాను కేవలం సైనికుడిని మాత్రమే కాకుండా.. దేశ పగ్గాలు చేతబట్టిన దౌత్యవేత్తను అని నిరూపించుకునేందుకే ఈ సూట్ ధరించినట్లు చెబుతున్నారు. 

 అయితే ఒకే రోజులో ఈ రెండు వేషధారణల మార్పుతో మునీర్‌ పాకిస్తాన్ అసలైన అధికారం తనదేనంటూ ప్రపంచ దేశాలకు సంకేతాలు పంపించారు. జేడీ వాన్స్‌తో రెడ్‌ కార్పెట్‌ ఆయన నవ్వుతూ ముచ్చటించారు. దీన్నిబట్టి పాకిస్థాన్‌లో పౌర ప్రభుత్వం కన్నా సైన్యానికే అత్యధిక ప్రాధాన్యం ఉందని ఈ దృశ్యం మరోసారి తెలియజేస్తోంది. ఇదిలాఉండగా గతేడాది కూడా భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత మునీర్‌ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడే ఆయన అమెరికా నేతలతో బలమైన సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read: అమెరికా టెక్ దిగ్గజాలకు షాక్: విండోస్‌కు గుడ్ బై చెప్పనున్న ఫ్రాన్స్!

అంతేకాదు మునీర్‌ పాక్‌ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల పాక్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ పాక్ సైన్యానికి చెందిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఈ వార్తలను ఖండించింది. అయితే భవిష్యత్తులో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు