/rtv/media/media_files/2025/02/07/yuZrHey4lO97KpYct29g.jpg)
Deportation
అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాతం మోపుతోంది. ఇప్పటికే రెండుసార్లు అమెరికా నుంచి భారతీయులను పంపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి మరో 487 మంది భారత విద్యార్థులను వెనక్కి పంపించనుంది. ఈ విషయంపై ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్‌పై భారత్‌తో చర్చలు జరిపామని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: 'అయ్యో బిడ్డా'.. అమెరికాలో తెలుగు స్టూడెంట్ సూసైడ్.. పంపించేస్తారన్న భయంతో..!
ఇటీవల వెనక్కి పంపిన భారతీయులకు సంకెళ్లు వేసి పంపించండం దుమారం రేపింది. దీంతో డిపోర్ట్ చేసేవారిని గౌరవంగా పంపాలని భారత్ అమెరికాను కోరింది. త్వరలోనే రాష్ట్రాలకు ఈ అంశంపై మార్గదర్శకాలు కూడా జారీ చేయనుంది. ఇప్పటికే ట్రంప్ సర్కార్.. 100 మంది భారతీయ విద్యార్థులను వెనక్కి పంపించింది.
Also Read: కెనెడాలో 20 వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ మిస్సింగ్.. వారంతా ఎక్కడ?
ఇదిలాఉండగా అమెరికాలోని హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం.. 20, 407 మంది భారతీయుల దగ్గర అమెరికాలో నివసించడానికి కావాల్సిన సరైన డాక్యుమెంట్స్ లేవని గుర్తించారు. అందులో 17,940 మందిని తిరిగి ఇండియా పెంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్భందంలో ఉన్నారు. ఈ క్రమంలోనే దశల వారిగా అక్కడ ఉంటున్న వారిని వెనక్కి పంపిస్తున్నారు.