/rtv/media/media_files/2025/02/26/uIkf6r0J1Sm0J61VlnmI.jpg)
China, Bangladesh
China-Bangla: భారత్ , బంగ్లాదేశ్ ల మధ్య బంధాలు బలహీనంగా మారాయి. షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా, ఆమె ఇండియాలో ఆశ్రయం పొందడం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. దానికి తోడు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు, ఇస్కాన్(ISKCON) పూజారులను అరెస్ట్ చేయడం భారత్ కోపానికి కారణం అయింది. బంగ్లాదేశ్ కూడా భారత్ ను తమ శత్రువు కింద భావిస్తోంది. కావాలని గొడవలు పడుతోంది ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం చైనాతో దోస్తీ కట్టేందుకు ఉత్సాహం చూపిస్తోంది. చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. అందుకు సంబంధించిన చర్యలను ప్రారంభించింది.
Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!
22 మంది సభ్యుల బృందం చైనాకు..
రీసెంట్గా బంగ్లాదేశ్ రాజకీయనాయకులు, జర్నలిస్టులు, కార్యకర్తలు, విద్యావేత్తలతో కూడిన బృందం చైనాకు చేరుకుంది. మొత్తం 22 మంది పదిరోజుల పాటూ చైనాలో పర్యటించడానికి వెళ్ళారు. ఇందులో బాగంగా అక్కడి పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులతో సమావేశం అవుతారని తెలుస్తోంది. దీన్ని చైనా కూడా ఆయుధంగా వాడుకుంటోంది. భారత్ మీద తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి బంగ్లాను వెపన్ చేసేకునే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. నిజానికి చైనానే బంగ్లాకు ఆ పర్యటనా ఆహ్వానాన్ని పంపింది. ఈ విషయాన్ని స్వయంగా బంగ్లాదేశ్ సీనియర్ నేత అయిన అబ్దుల్ మోయిన్ ఖాన్ చెప్పారు.
దీంతో పాటూ ఈ వారంలోనే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ సలహాదారుడు తౌహిద్ హుస్సేప్ కూడా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తో సమావేశమయ్యారు. ఈ ఏడాదిలో వీరిద్దరూ కలవడం ఇది రెండోసారి. భారత్ కు వ్యతిరేకంగా బంగ్లాలో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది అనడానికి ఇదో నిదర్శనం అని విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు 170 మిలియన్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్ చైనాకు ముఖ్యమైన భాగస్వామి కావచ్చు. ఇప్పటికే ఈ రెండు దేశాలు రెండు దేశాలు బలమైన వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ పరంగా కూడా దగ్గర అయితే భారత్ ను శాసించవచ్ిన చైనా భావిస్తోంది. బంగ్లాదేశ్ కూడా చైనాను అడ్డుపెట్టుకుని భారత్ మీద పగ తీర్చుకోవాలని చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: USA: తృటిలో తప్పిన పెను ప్రమాదం..ప్రయాణికులను కాపాడిన పైలెట్
Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?