/rtv/media/media_files/2025/02/05/v7LVSTu3eNUhqGqQf07w.jpg)
indians from us Photograph: (indians from us )
అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టిన అమెరికా..కొందరు భారతీయులను ఇటీవల పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో రెండు విమానాలు భారత్ కు రానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 15న వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరొక దాంట్లో మరింత మందిని తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అమెరికా చేపడుతోన్న డిపోర్టేషన్ ప్రక్రియలో భాగంగా 104 మంది భారతీయులను ఫిబ్రవరి 5న భారత్ కు తీసుకుని వచ్చారు. ఈ వ్యవహారం పై భారత విదేశాంగశాఖ స్పందిస్తూ..అమెరికా బహిష్కరణ తుది జాబితాలో మరో 487 మంది భారతీయులు ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపింది.దీంతో వీరంతా త్వరలోనే వెనక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: Ranveer Allahbadia: యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం
మరో వైపు అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాకు పంపించే ప్రక్రియ కొత్తదేమీ కాదని భారత ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.గడిచిన 15ఏళ్లలో 15,756 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లు తెలిపింది. 2009లో ఈ సంఖ్య 734 గా ఉండగా..2019 లో గరిష్ఠంగా2042 మందిని తిరిగి పంపించిందని పేర్కొంది.
దిగజార్చాలనే ఉద్దేశంతోనే...
అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలు అమృత్‌సర్ లో దించడం పై తాజా వివాదం కొనాసగుతోంది.బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ప్రతిష్ఠను దిగజార్చాలనే ఉద్దేశంతోనే వలసదారులతో వచ్చే విమానాలను అమృత్‌సర్ లో దించుతున్నారని పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు, హరియాణా, గుజరాత్ రాష్ట్రాలకు ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించిన ఆయన...ఈ విమానాలను అహ్మదాబాద్ లో ల్యాండింగ్ చేయాలని అన్నారు.