వచ్చే నెల ఫిబ్రవరికి రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై మూడేళ్ళు అవుతుంది. ఇప్పటికీ రెండు దేశాల మధ్యా వార్ నడుస్తూనే ఉంది. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునే వరకూ విడచిపెట్టేదే లేదని రష్యా అంటోంది. రష్యాకు సాయంగా ఉత్తర కొరియా తన సైన్యాన్ని యుద్ధభూమికి పంపించింది. మరోవైపు ఉక్రెయిన్‌కు నాటో దేశాలు మద్దతునిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది రష్యా నుంచి చాలా మంది సైనికులు , సౌరులు తమ దేశానికి తిరిగి వచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. Also Read : బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆకాశాన్ని తాకుతున్న ధరలు 1358 మంది పౌరులు... 2024 సంవత్సరంలో రష్యన్ బారి నుంచి తమ సైనికులు, పౌరులు మొత్తం 1358 మందిని సురక్షితంగా తప్పించి తీసుకువచ్చామని జెలెన్ స్కీ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. వారిని తీసుకురావడానికి మా సైనిక బృందం విపరీతంగా శ్రమించిందని చెప్పారు. 2025లోనూ మరింత మందిని వెక్కు తీసుకురావాలని కోరుకుంటున్నాని జెలెన్ స్కీ అన్నారు. రష్యాతో యుద్ధం ముగియడమే ఎప్పటికీ తన ఆకాంక్ష అంటూ పోస్ట్‌లో రాసారు. మరోవైపు యుద్దం మొదలైన దగ్గర నుంచి ఇప్పట వరకు 39 వేలమంఇద ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో పాటూ 3,400 కంటే ఎక్కువ పాఠశాలలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయని ఐరాసలోని ఉక్రెయిన్ మానవతావాద సమన్వయకర్త మథియాస్ ష్మాలే చెప్పారు. 10 మిలియన్ల మంది కీవ్ పౌరులు తమ ఇళ్ళను వీడి వెళ్ళాల్సి వచ్చింది. Also Read: China: శాటిలైట్ ద్వారా ప్రపంచంలో తొలి సర్జరీ..చైనా అద్భుతం యుద్ధం ఆపే ఛాన్స్ కనిపించడం లేదు.. ఇక రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం అంత తేలిగ్గా ఆపేదిలేదన్నారు. రష్యాతో పాటు తన పొరుగు దేశాల్లో సుదీర్ఘ శాంతి నెలకొనేలా చేసేందుకు చట్టబద్ధమైన ఒప్పందాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. ఇప్పట్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య సంధికి మార్గాలు కనిపించడం లేదన్నారు. ఒకవేళ బలహీన ఒప్పందం జరిగితే.. పశ్చిమ దేశాలు మళ్లీ ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేసి యుద్ధ తీవ్రతను మరింత పెంచుతాయని పేర్కొన్నారు. Also Read: Cricket: 500 వికెట్ క్లబ్‌లో కమిన్స్..7వ ఆస్ట్రేలియన్‌గా రికార్డ్ Also Read : HMPV వైరస్ తీవ్రత తక్కువే.. చైనా సంచలన ప్రకటన