Smartphone Reels: రీల్స్‌కు బానిసగా మారారా?..ఇలా బయటపడండి

ఫోన్‌లో రీల్స్‌ చూడటానికి బదులు సంగీతం వినవచ్చు, క్రాఫ్ట్ చేయవచ్చు, పుస్తకం చదవవచ్చు. రీల్స్‌ చూడటం అనేది మిమ్మల్ని అతిగా ఆలోచించేలా చేస్తుంది. రీల్స్‌కు బానిసగా మారకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Smartphone  Reels: రీల్స్‌కు బానిసగా మారారా?..ఇలా బయటపడండి

Smartphone Reels: వ్యసనం గురించి ప్రస్తావన వస్తే సాధారణంగా మద్యం, సిగరెట్లు, డ్రగ్స్ లేదా పొగాకు గురించి చెబుతుంటారు. అయితే ఫోన్ వ్యసనం అనేది వీటి కంటే పెద్దదని నిపుణులు అంటున్నారు. ఈ మధ్యకాలంలో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. రీల్స్‌ చూడటం, చేయడం అనేది బాగా వ్యసనంగా మారిపోయింది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీని బారిన పడుతున్నారు. ఇది సమయాన్ని వృథా చేయడమే కాకుండా మన శరీరం, మనస్సు రెండింటిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.

publive-image

కుటుంబానికి సమయం ఇవ్వండి:

ఇతరులతో కనెక్ట్‌ కావడం కోసమే మొబైల్‌ ఫోన్‌ ఉంది. ముఖ్యమైన సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడానికి, పంచుకోవడానికి మాత్రమే ఫోన్‌ని ఉపయోగించాలి. మీ ఫోన్‌లో Instagram, Facebook, Snapchat వంటి యాప్‌లు ఉంటే మీ కుటుంబంతో కలిసి డిన్నర్ చేయడానికి కూడా మీకు సమయం దొరకడం కష్టంగా ఉంటుంది. అందుకే ఎక్కువ సమయం ఫోన్‌ వాడకుండా కుటుంబంతో కలిసి గడపాలని నిపుణులు చెబుతున్నారు.

publive-image

మనసును ఇలా రిలాక్స్ చేసుకోండి:

ఈ రోజుల్లో ప్రజలు కొన్ని గంటలు కూడా ఫోన్‌కు దూరంగా ఉండలేకపోతున్నారు. ఫోన్‌ దగ్గర లేకపోతే నిద్ర, మనశాంతి కూడా ఉండదు. ట్రెండింగ్ ఏంటో తెలుసుకోవడంలో ఇతరుల కంటే ఎక్కడ వెనుకపడిపోతారో అన్న భయంతో ఫోన్‌ను మాత్రం వదిలిపెట్టరు. ఫోన్‌లో రీల్స్‌ చూడటానికి బదులు సంగీతం వినవచ్చు, నడవవచ్చు, క్రాఫ్ట్ చేయవచ్చు, పుస్తకం చదవవచ్చు లేదా నిద్రపోవచ్చు. ఇలా చేయడం వల్ల మెదడుకు మంచి ప్రశాంతత, విశ్రాంతి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

publive-image

స్నేహితులకు ఫోన్‌ చేయండి:

ఫోన్‌లో రీల్స్‌ చూసే బదులు స్నేహితులు లేదా బంధువులకు కాల్ చేయండి. సన్నిహిత వ్యక్తులను భోజనానికి ఆహ్వానించండి లేదా వ్యాయామాలు చేయాలి. వినోదం కోసం రీల్స్‌ చూస్తుంటే దానికి బదులు ప్రత్యక్ష సంగీత కచేరీకి వెళ్లడం, తోటపని చేయడం, పొరుగువారితో కలిసి నడవడం, అందరితో కలిసి కూర్చుని సినిమా చూడటం వంటివి చేయాలి.

publive-image

ఎలాంటి ప్రభావాలు ఉంటాయి?

రీల్స్‌ చూడటం అనేది మిమ్మల్ని అతిగా ఆలోచించేలా చేస్తుంది. మీ శ్రద్ద తగ్గుతుంది, అంతేకాకుండా జీవితాన్ని ఇతరులతో పోల్చడం ద్వారా అసంతృప్తి చెందుతారని నిపుణులు అంటున్నారు. ఫోన్‌ని నిరంతరం పట్టుకోవడం వల్ల మెడ, వేళ్లలో నొప్పి వస్తుంది. దీని వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. అందుకే రీల్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: మెడ నల్లగా మారడం దేనికి సంకేతం..ఈ అవయవానికి ముప్పుతప్పదా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Horoscope: నేడు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడుపుతారు!

మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో విపరీతమైన లాభాలు వస్తాయి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..

New Update
horoscope

horoscope

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో తరచూ ఆటంకాలు నిరాశ కలిగిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. మాటలు పొదుపుగా మాట్లాడాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఖర్చులు పెరగవచ్చు.

Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రోజులుగా వేధించిన ఆందోళన, ఒత్తిళ్లు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన దానికన్నా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. 

Also Read: Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు!

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విఘ్నాలు చికాకు పెడతాయి. ప్రయత్నలోపం లేకుండా చూసుకోండి. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు.

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో చేసే పనులు త్వరిత విజయాన్నిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ఓ కీలక వ్యవహారంలో పురోగతి సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు, ఖ్యాతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. పెట్టుబడుల ద్వారా ఆర్థిక లబ్ది చేకూరుతుంది. పెట్టుబడిదారులు గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు అందుకుంటారు. రుణభారం నుంచి ఉపశమనం పొందుతారు.

కన్యారాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో సత్వర విజయం ఉంటుంది. మీ ఖ్యాతి, ప్రజాదరణ అన్ని వైపుల నుంచి పెరుగుతుంది. డబ్బు రాక కూడా పెరుగుతున్న సంకేతాలున్నాయి. స్నేహితుల ద్వారా లబ్ధి పొందుతారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది.

తులారాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రీఘ్ర విజయం ప్రాప్తిస్తుంది. బుద్ధి బలంతో క్లిష్టమైన పనులను కూడా చాలా ఈజీగా పూర్తి చేస్తారు. అవివాహితుల విషయంలో పెళ్లి చర్చలు జరగడానికి ఛాన్స్‌ ఉంది.

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది. ఉద్యోగులు పని ఒత్తిడితో సతమతమవుతారు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారులు ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఒక శుభవార్త శక్తినిస్తుంది.

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. సమయస్ఫూర్తితో పనిచేసి కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. కొన్ని ఊహించని సంఘటనలు జరగవచ్చు. జీవిత భాగస్వామితో ఘర్షణలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. 

మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో విపరీతమైన లాభాలు వస్తాయి. నిరంతర కృషి, పట్టుదలతో తిరుగులేని విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. 

కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. మీ పనితీరుకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు.

మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ప్రారంభించిన పనుల్లో సమస్యలు తలెత్తుతాయి. ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. బంధువులతో మనస్పర్థలకు అవకాశముంది. జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. 

Also Read:WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

Also Read: Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

horoscope | Horoscope 2025 | horoscope-today | todays-horoscope | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment