క్రైం Mancherial District : యువకుడి ప్రాణం తీసిన లోన్‌యాప్.. ఉరేసుకొని ఆత్మహత్య మంచిర్యాలలో లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్(29) ఆర్థిక ఇబ్బందులతో లోన్యాప్లో రుణం తీసుకున్నాడు. ఒక నెల వాయిదా చెల్లించడం ఆలస్యం కావడంతో నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. మనస్థాపానికి గురైన శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. By Archana 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata Tragedy: కోల్‌కతా అత్యాచారం-హత్య కేసు.. మాజీ ప్రిన్సిపాల్ ఇంటిపై సీబీఐ దాడులు కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం-హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఒకవైపు నిందితులకు పాలీగ్రాఫ్ పరీక్షల నిర్వహణ జరుపుతోంది. మరోవైపు ఈ ఉదయం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అతని సన్నిహితుల ఇళ్లపై దాడులు నిర్వహించింది. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nalgonda Accident: నల్గొండ జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు TG: నల్గొండ జిల్లాలో ఒకే రోజు రెండు బస్సు ప్రమాదాలు సంభవించాయి. ప్రైవేట్ బస్సు బోల్తా పడి 30మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. శెట్టిపాలెంలో మరో ప్రైవేట్ బస్సు డీసీఎంను ఢీ కొట్టడంతో క్లినర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. By V.J Reddy 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata Rape Accused: కోల్‌కతా హత్యాచారం కేసు.. నిందితుడు సంజయ్ రాయ్‌కు నేడు పాలిగ్రాఫ్ టెస్ట్! కోల్‌కతా పీజీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ఈరోజు నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నారు. కాగా తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని జడ్జి ముందు నిందితుడు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pakistan : పాకిస్తాన్ లో బాంబు పేలుడు.. ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురి మృతి! పాకిస్తాన్ లో బాంబు పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పిషిన్ సివిల్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అర్బాబ్ కమ్రాన్ అందించిన వివరాల ప్రకారం మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిలో 13 మందిని క్వెట్టా ట్రామా సెంటర్‌కు పంపారు. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Madhya Pradesh : షాపింగ్ ఎక్కువ చేస్తోందని.. సుపారీ ఇచ్చి మరీ భార్యను చంపించిన భర్త మధ్యప్రదేశ్‌లో ఓ భర్త తన భార్యను తానే సుపారీ ఇచ్చి మరీ చంపించాడు. షాపింగ్‌కు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తుందనే కారణంతోనే అతను ఈ పని చేసినట్లు తెలుస్తోంది. కాస్త ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. By Manogna alamuru 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi : సెలవు కోసం 5 ఏళ్ళ చిన్నారి హత్య.. నిందితుల వయసు 9 నుంచి 11 ఏళ్ళు దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఓ మదర్సాలో విద్యార్థులు సెలవు కోసం 5 ఏళ్ళ చిన్నారిని హత్య చేసిన షాకింగ్ కేసు వెలుగు చూసింది. హత్య చేసిన వారి వయసు కేవలం 9 నుంచి 11 ఏళ్ళ మధ్యలో ఉండడం ఇక్కడ అన్నింటి కంటే ఆందోళన కలిగిస్తున్న విషయం. By Manogna alamuru 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Boiler Explosion: ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. 22 మందికి తీవ్ర గాయాలు మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఓ ఉక్కు కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బాయిలర్ పేలుడు వల్ల కరిగిన ఇనుము కార్మికులపై పడినట్లు పోలీసులు తెలిపారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident: రోడ్డు దాటుతుండగా ప్రాణాలు తీసిన అతివేగం.. వీడియో వైరల్ హైదరాబాద్‌లోని సూరారం పీఎస్ పరిధిలో రోడ్డు దాటుతున్న అబ్దుల్ సలాం అనే వ్యక్తిని అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. దాదాపు 20 మీటర్ల వరకు ఎగిరిపడ్డ అబ్దుల్ సలాం అక్కడిక్కడే మృతి చెందాడు. బైక్ నడిపిన వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. By B Aravind 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn