Chennai : కన్నకూతురిపై తల్లి ఘాతుకం: ప్రియుడితో అత్యాచారం చేయించి

చెన్నైలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. సాలిగ్రామంలో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కన్నతల్లి, సొంత కూతురికే నిద్రమాత్రలు ఇచ్చి తన ప్రియుడితో అత్యాచారం చేయించింది.

New Update
daughter

చెన్నై(chennai) లో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. సాలిగ్రామంలో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కన్నతల్లి, సొంత కూతురికే(daughter) నిద్రమాత్రలు ఇచ్చి తన ప్రియుడితో అత్యాచారం చేయించింది. భర్త కాపలాదారుడిగా పనిచేస్తూ వారానికి ఒకసారి మాత్రమే ఇంటికి వస్తుండటంతో, నిందితురాలైన తల్లి దక్షిణామూర్తి(50) అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. దీనిని కుమార్తె వ్యతిరేకించడమే ఆమె చేసిన పాపమైంది.

గత నెల 3వ తేదీన కుమార్తెకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో, తల్లి ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చింది. యువతి స్పృహ కోల్పోయిన సమయంలో ప్రియుడిని పిలిపించి ఆమెపై అత్యాచారం చేయించింది. ఆ తర్వాత మళ్ళీ 23వ తేదీన అదే విధంగా దారుణానికి ఒడిగట్టగా, ఈసారి యువతి స్పృహలోకి వచ్చి గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడిన తల్లి ఆమెను బయటకు రాకుండా గదిలో వేసి తాళం వేసింది.

Also Read :  20 సార్లు తప్పించుకున్న  జైషే ఉగ్రవాది.. 21 వసారి..

గర్భం దాల్చిన యువతి

అక్కడి నుండి ఎలాగోలా తప్పించుకున్న యువతి, తిరువణ్ణామలైలోని తన బంధువుల ఇంటికి చేరుకుని జరిగిన ఘోరాన్ని వివరించింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, యువతి గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

ఈ ఘటనపై సెయ్యారు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఘటన జరిగిన ప్రాంతం వడపళని కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. పోలీసులు ఆదివారం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కన్నతల్లే కాలయముడిలా మారి కూతురి జీవితాన్ని నాశనం చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మరోవైపు ఒడిశాలో దారుణం జరిగింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే కామాంధులుగా మారారు. కేంద్రపారా జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో నలుగురు టీచర్లు, ఓ ప్యూన్ దారుణానికి పాల్పడ్డారు. 12 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఇంట్లో ఒంటరిగా ఏడుస్తున్న కూతురిని తల్లి ప్రశ్నించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :  ఒడిశాలో దారుణం.. విద్యార్థినిపై ఐదుగురు టీచర్ల అత్యాచారం

Advertisment
తాజా కథనాలు