ట్రంప్ హత్యకు స్కెచ్.. తుపాకీతో ఇంట్లోకి దూరిన యువకుడు!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంట్లో సెక్యురిటీ వైఫల్యం బయటపడింది. ఫ్లోరిడాలోని 'మార్-ఎ-లాగో' ఎస్టేట్‌లో శనివారం అర్ధరాత్రి ఆయుధంతో చొరబడిన ఓ గుర్తు తెలియని వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

New Update
Trump's house

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంట్లో సెక్యురిటీ వైఫల్యం బయటపడింది. ఫ్లోరిడాలోని 'మార్-ఎ-లాగో' ఎస్టేట్‌లో శనివారం అర్ధరాత్రి ఆయుధంతో చొరబడిన ఓ గుర్తు తెలియని వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పోలీసులు, సీక్రెట్ సర్వీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న ట్రంప్ ఎస్టేట్ 'నార్త్ గేట్' నుంచి ఒక యువకుడు లోపలికి చొరబడ్డాడు. అతడి చేతిలో ఒక తుపాకీతో పాటు డీజిల్ క్యాన్ ఉండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు.

దుండగుడు ప్రమాదకరంగా ప్రవర్తించడంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని అక్కడికక్కడే హతమార్చారు. మరణించిన వ్యక్తి వయస్సు సుమారు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సాధారణంగా అధ్యక్షుడు ట్రంప్ తన వీకెండ్ టైంని మార్-ఎ-లాగో ఎస్టేట్‌లోనే గడుపుతుంటారు. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ ఇద్దరూ వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్‌లోనే ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. గతంలోనూ డొనాల్డ్ ట్రంప్‌పై పలుమార్లు దాడులు జరిగిన నేపథ్యంలో ఈ తాజా ఘటన భద్రతా సంస్థలను ఉలిక్కిపడేలా చేసింది.

జూలై 2024: పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఆ సమయంలో ఒక బుల్లెట్ ఆయన చెవిని తాకుతూ వెళ్లడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
రెండో ప్రయత్నం: పామ్ బీచ్ గోల్ఫ్ కోర్సులో రైఫిల్‌తో మాటువేసిన ఒక అనుమానితుడిని పోలీసులు గతేడాది అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, పామ్ బీచ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తి అసలు ఉద్దేశం ఏమిటి? ఆ నివాసంలోకి ఇంధనంతో ఎందుకు ప్రవేశించాడు? అతడి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ట్రంప్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడి భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న వేళ, ఈ దర్యాప్తు నివేదిక అత్యంత కీలకంగా మారనుంది.

Advertisment
తాజా కథనాలు