/rtv/media/media_files/2025/03/18/x5H2EF24cuygov1YFTLj.jpg)
Uttar Pradesh Wife killed Husband
Wife killed Husband: అంబులెన్స్ డ్రైవర్‌తో డ్రైవర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. ప్రియుడితో రాసలీలలు చేసేందుకు అడ్డుగా ఉన్నాడనే కోపంతో భర్తను దారుణంగా కడతేర్చింది. ఉంచుకున్న వాడితో కలిసి గొంతుకోసి చంపేసింది. అంతేకాదు భర్త మృతదేహాన్ని ఒక ఆటోలో మధుర జిల్లాలో 65 కి.మీ దూరంలో పడేసి తనకు ఏమీ ఎరుగనట్లు నటించింది. పోలీసులకు భర్త కనిపించట్లేదని ఫిర్యాదు చేయడంతో అలసు బాగోతం బయటపడింది. ఈ భయంకరమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో జరిగగా వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
వస్తువులు తీసుకురావడానికి వెళ్లి..
ఈ మేరకు పోలీసుల వివరాల ప్రకారం.. వెదురు కర్రల వ్యాపారి జితేంద్ర బాగెల్ జగదీష్‌పురా పోలీస్ స్టేషన్‌లోని బోడ్లా ప్రాంతం లాల్ మసీదు సమీపంలో కుటుంబంతో నివసిస్తున్నాడు. అయితే మార్చి 11వ తేదీ సాయంత్రం దుకాణం మూసివేసి జితేంద్ర ఇంటికి వచ్చాడు. కొంత సమయం తర్వాత కొన్ని వస్తువులు తీసుకురావడానికి ఇంటి నుండి బయటకు వెళ్లిన అతను.. రాత్రంతా ఇంటికి తిరిగి రాలేదు. అయితే మార్చి 12న తన భర్త అదృశ్యం గురించి జితేంద్ర భార్య నీతు పోలీసులకు సమాచారం ఇచ్చింది. కుటుంబ సభ్యులు కూడా జితేంద్ర కోసం వెతకడం ప్రారంభించారు.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
ఆటోలోంచి విసిరేసి..
5 రోజులుగా భర్త జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు భార్యపై అనుమానం ఉందంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నీతను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. తన భర్త తనను కొడుతుండేవాడని, అందుకే అతన్ని చంపేశానని పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని మధురలోని నిర్జన ప్రాంతంలో ఆటోలోంచి విసిరేశానని తెలిపింది. అయితే ఆ మహిళ ఒంటరిగా హత్య చేసి ఉండకపోవచ్చని పోలీసులు అప్పటికే అనుమానించారు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఆమె ప్రేమికుడు అంబులెన్స్ డ్రైవర్‌ను కూడా అరెస్టు చేశారు.
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
ఈ కేసు గురించి లోహా మండి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మయాంక్ తివారీ మాట్లాడుతూ.. మార్చి 11న జితేంద్ర మిస్సింగ్ కేసు జగదీష్‌పురా పోలీస్ స్టేషన్‌లో నమోదైందని తెలిపారు. జితేంద్ర హత్యకు అతని భార్యే పథకం వేసినట్లు దర్యాప్తులో తేలింది. జితేంద్ర భార్య స్నేహితుడు విష్ణు బాఘేల్, అతని స్నేహితుడు అనిల్ కలిసి జితేంద్రను ఆల్టో కారులో కూర్చోబెట్టారు. మార్గమధ్యలో అతని మెడను టవల్ అదిమి పట్టి గొంతు కోసి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని మధుర జిల్లాలోని ఫరా ప్రాంతంలో విసిరేశారు. ప్రేమ వ్యవహారం కారణంగా ఈ హత్య ఒక పథకం ప్రకారం జరిగింది. ప్రస్తుతం నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.
Also Read: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!