/rtv/media/media_files/2025/03/17/LgSLpfHGQrBFP5mvI4Zh.jpg)
Telangana Jagityal mother and Sons killed father
తెలంగాణ (Telangana) లో మరో హృదయవిదారక ఘటన జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య తమ ముగ్గురు పిల్లలతో కలిసి అత్యంత కృరంగా హతమార్చింది. ఈ మర్డర్‌లో కూతురును చేసుకున్న అల్లుడు కూడా పాలుపంచుకోవడం రాష్ట్రంలో కలకలం రేపింది. అయితే క్షణికావేశంలో ఈ దారుణానికి పాల్పడ్డవారంతా తండ్రి లేడని నిజాన్ని కాసేపటికి గ్రహించి కన్నీరుమున్నీరయ్యారు. గుండెలు పగిలేలా నాన్నా.. నాన్నా అంటూ రోదించారు. గ్రామ ప్రజలను సైతం భావోద్వేగానికి గురిచేసిన ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో జరగగా వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read : వీడు మామూలోడు కాదు గురూ.. సైబర్ స్కామర్‌నే బురిడి కొట్టించి.. తిరిగి డబ్బులు నొక్కేశాడు!
తండ్రిపై కక్షపెంచుకున్న మొదటి భార్య..
పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్ (58) కొంతకాలం క్రితం జమునను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కొడుకు చిరంజీవి, చిన్న కొడుకు రంజిత్, కూతురు శిరీష ఉన్నారు. శిరీషను శోభన్ అనే వ్యక్తికి పెళ్లి చేయగా.. కొడుకులతో కలిసి ఉంటుంది జమున. అయితే పిల్లు పుట్టిన తర్వాతే మరో మహిళను పెళ్లిచేసుకున్న కమలాకర్ రెండు కుటుంబాలను చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. తరచు గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే తండ్రిపై కక్షపెంచుకున్న మొదటి భార్య, పిల్లలు, అల్లుడు కలిసి కమాలాకర్‌ను పెట్రోల్ పోసి అంటించారు. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
ఇది కూడా చదవండి: Teenmar Mallanna: కేటీఆర్, హరీష్ తో మల్లన్న భేటీ.. కారణం అదేనా?
ఆదివారం పోస్టుమార్టం పూర్తి చేయించి పోలీసులు మృతదేహాన్ని పొలాసకు తరలించారు. ఈ దారుణానికి పాల్పడ్డ వారందరినీ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. దీంతో కమాలాకర్ అంత్యక్రియలకు బంధువులు, గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు. పోలీసులు ప్రత్యేక బందోబస్తుతో మొదటి భార్య జమునతోపాటు వారి పిల్లలను పొలాసకు తీసుకెళ్లారు. అక్కడికి చేరకుని కమలాకర్ మృతదేహాన్ని చూడగానే వారంతా బోరున విలపించారు. ఈ దృష్యం చూసిన స్థానికులు సైతం కన్నీరుమున్నీరయ్యారు. కమలాకర్ సోదరుడు రవి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సధాకర్ తెలిపారు. కమలాకర్ అంత్యక్రియలు పూర్తికాగానే మృతికి కారణమైన ఐదుగురిని ఆది వారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కృష్ణారెడ్డి చెప్పారు.
ఇది కూడా చదవండి: CM Revanth: చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన!
ఇదిలా ఉంటే.. పడాల కమలాకర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు భారీ ఆయుధాలు లభించడం సంచలనం రేపింది. తల్వార్లు, కత్తులు, రాడ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కమలాకర్ మారణాయుధాలు వెంట ఉంచుకున్నట్లు గుర్తించారు.
Also Read : పిఠాపురం, మంగళగిరికి సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన!