/rtv/media/media_files/2026/04/15/tcs-nashik-case-2026-04-15-14-35-15.jpg)
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ కార్యాలయంలో వెలుగుచూసిన ఉదంతం(TCS Nashik case) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల ముసుగులో అమాయక ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడికి ప్రేరేపించడం, లైంగిక వేధింపు(Sex Harassment) లకు పాల్పడటం వంటి విస్తుపోయే అంశాలు పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : దెబ్బ మీద దెబ్బ.. రాఘవ్ చద్దాకు ఆప్ బిగ్ షాక్
ఒక పక్కా ప్లాన్.. ఒక 'టార్గెట్' నెట్‌వర్క్
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ కుట్ర వెనుక సీనియర్ సిబ్బంది, హెచ్‌ఆర్ మేనేజర్‌లతో కూడిన ఒక పటిష్టమైన నెట్‌వర్క్ పనిచేస్తోంది. వీరు ముఖ్యంగా కొత్తగా చేరిన ఉద్యోగుల సమాచారాన్ని విశ్లేషించి, ఆర్థికంగా వెనుకబడిన లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వారిని టార్గెట్‌గా ఎంచుకుంటారు. నింధితులకు మలేషియా నుంచి లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
శిక్షణ సమయంలో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అభ్యర్థులను మానసికంగా దెబ్బతీస్తారు. వారు కలత చెందిన సమయంలో, హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్ వంటి వారు సానుభూతి నటిస్తూ వారిని దరిచేర్చుకుంటారు. మెల్లగా వారి నమ్మకాన్ని గెలుచుకుని, వారి జీవనశైలిని, వస్త్రధారణను మార్చేలా ఒత్తిడి చేస్తారు. ఒక బాధితురాలు ఏకంగా తన ఇంట్లోని దేవుళ్ళ పటాలను తొలగించి, ఫ్యామిలీతో గొడవపడే స్థాయికి బ్రెయిన్ వాష్ చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మారువేషంలో 'ఖాకీలు'.. ఆపరేషన్ సక్సెస్!
ఈ కుట్రను ఛేదించడానికి పోలీసులు ఓ సీక్రెట్ ఆపరేషన్‌ను నిర్వహించారు. నిందితులకు అనుమానం రాకుండా ఉండేందుకు మహిళా కానిస్టేబుళ్లు హౌస్‌కీపింగ్ సిబ్బంది వేషంలో కార్యాలయంలోకి ప్రవేశించారు. బయటి ఏజెన్సీ ద్వారా ఈ సేవలు అందుతుండటంతో నిందితులు వీరిని గుర్తించలేకపోయారు. పురుష పోలీసులు కూడా మారువేషంలో ఉండి ఆధారాలు సేకరించారు. ఆరోపణలు నిజమని తేలడంతో పోలీసులు మెరుపు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
Also Read : 180 బాలికలను లైంగికంగా వేధించిన యువకుడు.. 350 పైగా అశ్లీల వీడియోలు
వాట్సాప్ గ్రూపుల్లో భయంకరమైన కుట్రలు
నిందితులు సంప్రదించుకోవడానికి ఒక స్పెషల్ వాట్సాప్ గ్రూప్ నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. టార్గెట్ చేయాల్సిన ఉద్యోగుల జాబితా. కంపెనీ అంతర్గత రాజకీయాల ద్వారా ఉద్యోగులను భయపెట్టడం. తీవ్రవాద మతపరమైన అంశాలపై చర్చలు జరుగుతుండేవి.
ఈ కేసులో ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషీ, రజా మెమన్, తౌసిఫ్ అత్తర్‌లతో పాటు మరికొందరిని పోలీసులు విచారిస్తున్నారు. లైంగిక వేధింపులు మరియు భౌతిక దాడుల కోణంలో SIT లోతుగా విచారణ చేపట్టింది. ఈ ఘటన కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల భద్రత, కార్యాలయ సంస్కృతిపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
Follow Us