/rtv/media/media_files/2025/01/01/aXA1WWqy1MkjiMWTaBGg.jpg)
Suryapet mother killing daughter case
TG Crime: మూఢనమ్మకాల పిచ్చితో కన్న బిడ్డనే బలిచ్చిన తల్లికి కోర్టు ఉరిశిక్ష విధించింది. సూర్యపేట మేకలపాటితండాకు చెందిన బానోతు భారతి ఆనారోగ్యం బారిన పడింది. దీంతో 2021లో జ్యోతిష్కుడి మాటలు నమ్మి తన 7 నెలల కూతురి గొంతు, నాలుక కోసి చంపింది. అయితే ఈ కేసుపై తుది విచారణ చేపట్టిన సూర్యాపేట ఒకటో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి డా.ఎం.శ్యాంశ్రీ ఆమెకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడిచింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జోతిష్కుడి మాటలు నమ్మి..
సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటితండాకు చెందిన బానోతు భారతి మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తన బాల్యమిత్రుడు మేకలపాటి తండాకు చెందిన బానోతు కృష్ణను రెండో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ముందు ఆమె ఆనారోగ్యం బారిన పడుతోంది. తల్లిదండ్రులు నాటు వైద్యులకు చూపించినా మార్పు రాలేదు. దీంతో ఓ జోతిష్కుడి మాటలు నమ్మిన భారతి రకరకాల పూజలు చేయడం మొదలుపెట్టింది. ఒక పాప పుట్టినా తన ప్రవర్తనలో మార్పురాలేదు.
ఇది కూడా చదవండి: యువతకు నోటి క్యాన్సర్ ముప్పు..ఈ లక్షణాలను అశ్రద్ధ చేయొద్దు
ఈ క్రమంలో 2021 ఏప్రిల్ 15న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూజలు చేసింది. తన 7 నెలల బిడ్డను గొంతు, నాలుక కోసి బలిచ్చింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త కృష్ణ ఫిర్యాదుతో నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గతంలో బెయిల్‌పై విడుదలైన భారతిని గ్రామపెద్దల సూచనలతో భర్త ఇంటికి తీసుకెళ్లాడు. అయితే తనపై కేసు పెట్టాడనే కోపంతో 2023లో అతను ఇంట్లో నిద్రిస్తుండగా బలి పేరుతో తలపై ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించడం సంచలనం రేపింది.
ఇది కూడా చదవండి: వేసవి విడిది కోసం బెస్ట్ ప్లేసులు ఇవే
mother | killed | daughter | court | suryapet | today telugu news