శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైజాగ్‌కి చెందిన ఫ్యామిలీ మొక్కు తీర్చుకోవడానికి ఒడిషా వెళ్తుండగా.. కంచిలి దగ్గర వీరి కారు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
accident (1)1

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొందరు అతివేగం లేదా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ వ్యాప్తంగా రోజుకీ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇలా మరణించిన వారి సంఖ్య మనకి పదుల్లో మాత్రమే తెలుస్తోంది. కానీ తెలియకుండా జరిగిన యాక్సిడెంట్లు కూడా ఎన్నో ఉన్నాయి. అందులోనూ ఇది శీతాకాలం కావడంతో.. పొగమంచు వల్ల జరిగిన యాక్సిడెండ్లు కూడా ఉన్నాయి. 

ఇది కూడా చూడండి: అశ్విన్‌ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! 

ఒడిషా అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా..

ఇదిలా ఉండగా తాజాగా శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం, సీతమ్మధారకు చెందిన ఐదుగురు ఒడిషాలోని జార్జిగూడ దుర్గా అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. ఉదయం 5 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి బయలు దేరారు. ఇలా వెళ్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

ఇది కూడా చూడండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే!

స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి..

ఉదయం 9 గంటలకు కంచిలి మండలం కొజ్జీరియా దగ్గర హైవేపై ఓ విద్యుత్ పోల్‌కు ఢీకొట్టారు. దీంతో అక్కడిక్కడే ముగ్గురు దుర్మణం చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మొక్కు తీర్చుకోవడానికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్

ఇది కూడా చూడండి: AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి

పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.  

New Update
HP accident

HP accident

పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.  

తమ్ముడి వివాహం అయిపోయాక 

మృతులను చాచియోట్ తహసీల్‌లోని తరౌర్ గ్రామానికి చెందిన రమేష్ చంద్ కుమారుడు దునిచంద్ (33), తరౌర్ గ్రామానికి చెందిన దునిచంద్ భార్య కాంతా దేవి (28), వారి కుమార్తె కింజల్ (8 నెలలు), చాచియోట్ తహసీల్‌లోని నౌన్ గ్రామానికి చెందిన థాలియా రామ్ కుమారుడు దహ్లు రామ్ (52), నేపాల్ నివాసి మీనా దేవి (30)గా గుర్తించారు. దునిచాంద్ తమ్ముడి వివాహం అయిపోయిన తరువాత కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.  

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పాండో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం, SDRF, CISF, పాండో అవుట్‌పోస్ట్ బృందాలు మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాయి

Advertisment
Advertisment
Advertisment