Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు మృతి

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ధనపురం క్రాస్‌ వద్ద హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

New Update
ACCIDENT

ACCIDENT

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ధనపురం క్రాస్‌ వద్ద హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మహిళలు స్పాట్‌లోనే మ‌ృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే హిందూపురం ఆసుపత్రికి తరలించారు. కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ముగ్గురు మృతి..

ఇదిలా ఉండగా ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఈ మేరకు కోరుకొండ ఎంపీడీవో ఆఫీస్ వెనక రైస్ మిల్ లోకి శనివారం ఉదయం గోడౌన్ నుండి రైస్ ను ట్రాలిలో రైస్ తీసుకుని వస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో అక్కడికక్కడే మృతులు ఆకుల శ్రీరాములు (34), పలసాని అన్నవరం (55),జాజుల వెంకన్న (46) చనిపోయారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

మృతిపై సమగ్ర విచారణ జరిపి రైస్ మిల్ యజమాన్యంపై, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బలరామకృష్ణ  తెలిపారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరఫున రావాల్సిన నష్టపరిహారాన్ని చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. 

ఇది కూడా చూడండి:  AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

 

latest-telugu-news | andhra-pradesh-news | road-accident | telugu-news | today-news-in-telugu | telugu crime news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: వేట మొదలైంది.. ఆ ఉగ్రవాది ఇల్లు నేలమట్టం చేసిన ఆర్మీ!

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో ఒక ఉగ్రవాది ఇల్లును ఐఈడీతో పేల్చివేసినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్‌కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్‌ గుర్తించారు.

New Update
Asif Sheikh

Asif Sheikh

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిలో ఒక ఉగ్రవాది ఇల్లును ఐఈడీతో పేల్చివేసినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్‌కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్‌ అనే వ్యక్తి ఇంటిని ఐఈడీతో ధ్వంసం చేసినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

ఇది కూడా చూడండి: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

ఇది కూడా చూడండి: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment