Kidnap: వరంగల్‌లో కిలాడీ లేడీ ..  బాలికలను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారాలు

వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు బయటపడ్డాయి.  పాఠశాలకు వెళ్లే బాలికలను టార్గెట్ చేస్తూ వారిని కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలు చేయిస్తుంది.  తాజాగా ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ భయంకరమైన ఘోరాలు బయటపడ్డాయి

New Update
kidnap Warangal

వరంగల్‌ (Warangal) లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు బయటపడ్డాయి.  పాఠశాలకు వెళ్లే బాలికలను టార్గెట్ చేస్తూ వారిని కిడ్నాప్ (Kidnap) చేసి, డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలు చేయిస్తుంది.  తాజాగా ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ భయంకరమైన ఘోరాలు బయటపడ్డాయి.  హనుమకొండ జిల్లాలోని దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఈ కిలాడీ లేడీ మిల్స్ కాలనీ పరిధిలో నివాసముంటోంది.

Also Read :  విమానంలో చెలరేగిన మంటలు..ప్రయాణికులు రెక్కలపై నిల్చుని!

డ్రగ్స్‌కు అలవాటు పడి

డ్రగ్స్ కు బానిసైన ఈ లేడీ..   తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన కొంతమంది యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి..  స్కూల్ కు వెళ్లే బాలికలను టార్గెట్ చేస్తుంది. వరంగల్ లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తుంది. స్కూల్ కు వెళ్లివచ్చే టైమ్ లో బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతుంది. ఆ తరువాత చనువు పెంచుకుని, కలివిడిగా ఉన్నట్టు నటించి బాలికలను కిడ్నాప్ చేస్తోంది. ఆ బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి అప్పటికే తన, తన గ్యాంగ్ కు టచ్లో ఉన్న మానవ మృగాలకు అప్పగిస్తోంది.

Also Read :  60ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ హీరో డేటింగ్.. ఎవరీ గౌరీ స్ప్రాట్‌?

బాలికలు మత్తులో ఉండగా

కిలాడీ లేడీకి డబ్బు ఇచ్చే ఆ మానవ మృగాలు.. బాలికలు మత్తులో ఉండగా వారిపై అత్యాచారాలు చేసేవారు. బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అక్కడే వదిలేసి వెళ్లిపోయేది. ఇలా ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ పలువురు బాలికల జీవితాలను నాశనం చేసింది.

Also Read :  జనసేన ఆవిర్భావ దినోత్సవం.. అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్

కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్కజిల్లాలకు కూడా తరలించినట్టు సమాచారం.  అయితే వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోగా కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్లు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తోన్న అరాచకాలు తెలిశాయి. సదరు కిలాడీ లేడీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 

Also Read :  అన్నమయ్య జిల్లాలో లారీలు నుజ్జు నుజ్జు.. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

పోర్న్ వీక్షకులకు పోలీసులు బిగ్ షాక్ ఇస్తున్నారు. చైల్డ్ ఫోర్నోగ్రఫీపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌ కేంద్రంగా 3 నెలల్లోనే 15 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. పిల్లల పోర్న్ చూసిన, షేర్ చేసిన కేసులు తప్పవంటున్నారు.

New Update
porn cases

Telangana Police special focus on child pornography

Pornography: పోర్న్ వీక్షకులకు పోలీసులు బిగ్ షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా చైల్డ్ ఫోర్నోగ్రఫీపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇంటర్‌నెట్‌, సోషల్ మీడియా మాధ్యమాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీని చూసినా, పోస్ట్ చేసినవారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లోయిటెడ్ చిల్డ్రన్ పోర్టల్.. చిన్నపిల్లల అశ్లీల వీడియోల క్రియేటింగ్, షేరింగ్, సర్క్యులేటింగ్ చైల్డ్ ఎబ్యూజ్ మెటీరియల్‌లకు పాల్పడే వారిని సులభంగా గుర్తిస్తోంది. ఐపీఅడ్రస్, ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ల వివరాలను సెకరించి ఆయా జిల్లాల సీఐడీ అధికారులకు పంపించి.. సంబంధిత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటున్నారు. 

నిందితుల్లో యువకులే అధికం..

ఇటీవల హైదరాబాద్‌ కేంద్రంగా చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించిన కేసుల్లో ఆరుగురు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు 3 నెలల్లోనే 15 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నిందితుల్లో యువకులే అధికంగా ఉంటున్నట్లు చెప్పారు. కొంతమంది నకిలీ సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా సర్క్యులేట్ చేస్తున్నారని, పేరు, వివరాలు గుర్తించలేరనే ఉద్దేశంతో టెలీగ్రామ్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు చేరవేసుకుంటున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కొందరి ఐపీ అడ్రస్‌తో అసలు నిందితులెవరనేది పోలీసు, నిఘావర్గాలు గుర్తిస్తాయనేది అంచనా వేయలేక.. కేసుల్లో ఇరుక్కుని ఆందోళన చెందుతున్నారు. 

Also read: BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం

కేసులు పెట్టొద్దంటూ క్షమాపణలు..

విద్యారులు, ఉద్యోగార్థులు, పెళ్లీడు యువకులు చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసుల్లో ఇరుక్కుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కేసులు పెట్టొద్దంటూ పోలీసులకు క్షమాపణలు కోరుతున్నాని, పలు సాక్ష్యాల ఆధారంగా కొందరికి కౌన్సెలింగ్ ఇచ్చి మరికొందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. పిల్లలు ఏం చూస్తున్నారనేది గమనించాలని పేరెంట్స్ కు సూచిస్తున్నారు. నిషేధిత వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని, ఇంటర్ నెట్ లో ఏం సెర్చ్ చేస్తున్నారో తరచూ పరిశీలించాలంటున్నారు. వారిపై నిఘా ఉంచామనే అనుమానం రాకుండా జాగ్రత్తగా వ్యవహరించి వారిని తప్పుదోవపట్టకుండా జాగ్రత్తపడాలంటున్నారు. 

Also : BIG BREAKING: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’



porn-movies | child | police | cases | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment