/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/crime-1.jpg)
AP Crime: ఏపీలో మరో కీచక టీచర్ నిర్వాకం బయటపడింది. ఓ ఊపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు క్లాస్ రూమ్, బటయ ఖాళీ సమయాల్లో విద్యార్థినిలకు నీలి చిత్రాలు చూపించి, వల్గర్ గా వ్యవహరించినట్లు పలువురు బాలికలు ఆరోపించడం సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి్ వివరాలు ఇలా ఉన్నాయి.
సరస్వతి పూజ రోజు కూడా..
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి ఉన్నత పాఠశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న బొజ్జన్న.. అదే స్కూల్ విద్యార్థినిలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలొస్తున్నాయి. రెండేళ్ల నుంచి అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా విద్యార్థినీలను దూషిస్తున్నట్లు చెబుతున్నారు. సరస్వతి పూజ రోజు కూడా ఇలాగే ప్రవర్తించాడని పదవ తరగతి విద్యార్థినులంతా బోరుణ విలపిస్తూ పేరెంట్స్ కు ఫిర్యాదు చేశారు. దీంతో తమ గోడును మహిళా టీచర్లకు వివరించగా వారంతా హెచ్ఎం వెంకటేశ్వర్లు సమాచారం అందించారు.
Also Read: UP Crime: భర్తను చంపి.. సిమెంట్ డ్రమ్‌లో కలిపేసి: ప్రియుడికోసం నేవి అధికారి భార్య ఘోరం!
సెలవులపై వెళ్లిపోవాలని ఆదేశాలు..
దీంతో పిల్లలను అడిగి తెలుసుకున్న వెంకటేశ్వర్లు.. కీచక టీచర్ బొజ్జన్నను స్కూల్ కి రావద్దనీ, సెలవులపై వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే పిల్లల తల్లిదండ్రులు బొజ్జన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇలాంటి కీచక టీచర్లు ఏ పాఠశాలలో కూడా పనిచేయడానికి వీల్లేదని వెంటనే విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Also Read: అసభ్యకర స్టెప్పులేస్తే దబిడి దిబిడే.. ఫిల్మ్ ఇండస్ట్రీకి మహిళా కమీషన్ వార్నింగ్
(rtv telugu teacher | sexual-harassment | students | rtv telugu today telugu news | latest-telugu-news)