/rtv/media/media_files/2025/02/23/ST6xtegD1EPq3ogPULMY.jpg)
nalgonda Photograph: (nalgonda)
Accident: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చింతపల్లి బైపాస్ వద్ద ప్రైవేట్ బస్సు ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ దారుణం జరిగింది.
పెళ్లికి వెళ్లి వస్తుండగా..
ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి నార్కెట్ పల్లి రహదారి చింతపల్లి బైపాస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకారం నెల్లూరుకు చెందిన పలువురు హైదరాబాదులో ఓ పెళ్లికి హాజరై ప్రైవేట్ బస్సులో నెల్లూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మిర్యాలగూడ వాటర్ ట్యాంక్ తండాకు చెందిన ట్రాక్టర్ ను బస్సు వెనక వైపు నుంచి బలంగా ఢీ కొట్టింది. ట్రాక్టర్ లో ప్రయాణం చేస్తున్న నునావత్ సునీత అక్కడికక్కడే చనిపోయింది.
ట్రాక్టర్ డ్రైవర్ నునావత్ సైదాకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఉన్న రాజశేఖర్, నాగ చరిత, శైలజ, రాధ, అఖిల, శివరామకృష్ణ, సురేందర్ తోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ లకు గాయాలయ్యాయి. డ్రైవర్ సైదాతో పాటు మరో ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు.