Mastan Sai: 300 కాదు 499 నగ్న వీడియోలు.. మస్తాన్ సాయి కేసులో మరిన్ని భయంకర నిజాలు!

మస్తాన్‌సాయి కేసులో మరిన్ని భయంకర నిజాలు బయటపడుతున్నాయి. హార్డ్ డిస్క్‌లో 499 నగ్న వీడియోలు బయటపడ్డట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఎక్కవ శాతం యువతుల వీడియోలున్నట్లు వెల్లడించారు. లావణ్యతోపాటు ఆమె స్నేహితుల ఫొటో, వీడియోలున్నట్లు చెప్పారు.

New Update
mastan sai lv

mastan sai lv Photograph: (mastan sai lv)

Mastan sai: మస్తాన్‌సాయి కేసులో మరిన్ని భయంకర నిజాలు బయటపడుతున్నాయి. లావణ్య పోలీసులకు ఇచ్చిన మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో ఇప్పటిదాకా 300 నగ్న వీడియోలు బయటపడ్డట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా అతని ఫోన్‌లో 499 వీడియోలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఎక్కవ శాతం యువతుల వీడియోలున్నట్లు వెల్లడించారు. 

మొత్తం 499 నగ్న వీడియోలు..

ఈ మేరకు నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకొని విచారించగా హార్డ్‌డిస్క్ వీడియోల గురించి ఓపెన్ అయ్యాడు. మూడేళ్ల నుంచి రహస్యంగా సేకరించిన ఫొటో, వీడియోలున్నాయి. హార్డ్‌డిస్కులో ఇతరుల ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ ఉన్నట్లు తెలిపారు. అందులో మొత్తం 499 వీడియోలు ఉండగా 6గురు యువతులతో న్యూడ్ వీడియోకాల్స్‌ మాట్లాడాడు. ఈ సమయంలోనే వారికి తెలియకుండా స్క్రీన్‌ రికార్డింగ్‌ చేసుకున్నాడు. తన గదికి వచ్చిన అమ్మాయిలు తనతో ప్రైవేటుగా ఉన్నప్పుడు రహస్యంగా రికార్డు చేశాడు. లావణ్య, ఆమె స్నేహితులను కూడా  లోబర్చుకుని లైంగికంగా వాడుకున్నాడని వెల్లడించారు. ఇక డ్రగ్స్ అంశంపై మాత్రం మస్తాన్ నోరు విప్పలేదని చెప్పారు. గతంలో అతనిపై రెండు డ్రగ్స్‌ కేసులున్నాయని, హార్డ్‌డిస్కులో ఉన్న వీడియోల్లో డ్రగ్స్‌ పార్టీల్లో పాల్గొన్న వ్యక్తులెవరో పరిశీలించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Rape case: 4గురు బిడ్డల తల్లిపై గ్యాంగ్ రేప్.. ప్రైవేట్ పార్ట్స్ కొరికి, గోళ్లతో రక్కి!

ఇదిలా ఉంటే.. మస్తాన్ సాయి కేసుపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది నాగూరుబాబు సంచలన లేఖ రాశారు. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది కోరారు. దర్గా ధర్మకర్త కొడుకు అయిన మస్తాన్ సాయి నేరాలతో దర్గా పవిత్ర, భద్రతకు, భంగం వాటిల్లుతుందని అటువంటి వ్యక్తి తండ్రిని ధర్మకర్తగా ఎలా కొనసాగిస్తారని లేఖలో న్యాయవాది ప్రస్తావించారు. మస్తాన్ సాయిపై ఇప్పటికే మహిళల నగ్న చిత్రాలు, డ్రగ్స్ కేసులు, అత్యాచారం, ఇలా సుమారు ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని లాయర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల భక్తుల భద్రత, దర్గా ప్రతిష్టతకు భంగం వాటిల్లుతుందని లేఖలో న్యాయవాది నాగూరు బాబు తెలిపారు. మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కుటుంబ ఆధిపత్యాన్ని తొలగించి, ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో దర్గాను నిర్వహించాలని లేఖలో వివరించారు. మస్తాన్ సాయిపై ఇప్పటివరకు ఉన్న అన్ని కేసుల వివరాలు లేఖలో లావణ్య న్యాయవాది నాగూరు బాబు ప్రస్తావించారు.

ఇది కూడా చదవండి: Raj Tarun-Lavanya Case: ఓవైపు రాజ్ ని ప్రేమిస్తూనే మస్తాన్ సాయితో బెడ్ రూమ్ లో.. లావణ్య గురించి ఫ్రెండ్ ప్రీతీ..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు