/rtv/media/media_files/2025/03/12/ue3tjeEECHFSl9n0y2lX.jpg)
Husband kills wife for mutton curry
Mutton Murder: ఓ తిండిబోతు భర్త దారుణానికి పాల్పడ్డాడు. బయటకెళ్లి ఇంటికొచ్చే వచ్చేసరికి ఇళ్లాలు మాంసం కూర వండలేదని విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆమె సమస్య చెప్పినా పట్టించుకోకుండా తనలో ఉన్న కసాయి తనాన్ని నిద్రలేపి పాపం కట్టుకున్న ఆవిడను ఘోరంగా కడతేర్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను తలపై కొట్టి చంపాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుండగా వివరాలు ఇలా ఉన్నాయి.
మటన్ వండలేదని కర్రతో కొట్టి..
మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం మాంజాతండాలో ఈ దారుణం జరిగింది. మాంజాతండాకు చెందిన మాలోత్ బాలు అనే వ్యక్తి పనిమిద బయటకెళ్లి ఇంటికి వచ్చాడు. అయితే తాను వచ్చేసరికి మటన్ వండాలని భార్య మాలోత్ కళావతికి చెప్పాడు. కానీ పని ఉండటంతో ఆమె మాసం వండలేకపోయింది. దీంతో మద్యం సేవించి ఇంటికొచ్చిన బాలు.. ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెపై బూతుల వర్షం కురిపించాడు. దీంతో ఆమె తిరగబడగా ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన బాలు.. ఇంట్లో ఉన్న కర్రతో ఆమె తలపై బలంగా కొట్టాడు. వెంటనే సృహ కోల్పోయిన కళావతిని పక్కించివారు ఆస్పత్రికి తరలించేలోపే రోడ్డు మార్గంలో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత బాలు పారిపోయాడు.
ఇది కూడా చూడండి: Kartik Aaryan: కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్.. కన్ఫామ్ చేసిన హీరో తల్లి?
మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కళావతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పరారిలో ఉన్న భర్త బాలుకోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో 8వ తరగతి చదువుతున్న బాలికపై ఆమె తండ్రి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే మంగళవారం స్కూల్ కి వెళ్లిన బాలిక డల్ గా కనిపించడంతో.. టీచర్ ఏమైందని అడిగారు. ఈ క్రమంలో బాలిక తండ్రి ఓ రాక్షసుడని బయటపడింది. బాలిక తల్లి 8 ఏళ్ల కిందట భర్తతో విభేదాల కారణంగా పుట్టింటికి వెళ్లింది. కాగా, 3 ఏళ్లుగా పెద్ద కుమారై తండ్రి వద్ద ఉంటుంది. ఈ క్రమంలోనే బాలిక తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. విషయం బయటపడడంతో బాలిక తండ్రి పై రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది.