Whatsapp Kiss: రెండు కుటుంబాల్లో విషాదం నింపిన వాట్సప్ ముద్దు.. ఇద్దరినీ నరికి చంపిన భర్త!

కేరళలో దారుణం జరిగింది. తన భార్య వైష్ణవికి స్నేహితుడు విష్ణు వాట్సప్‌లో కిస్ ఎమోజీ పంపించాడనే కోపంతో బైజు ఇద్దరినీ నరికేశాడు. కొడవలితో వేటాడి వెంటాడి చంపాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు బైజును అరెస్ట్ చేశారు.  

New Update
kerala kiss

kerala kiss Photograph: (kerala kiss)

Whatsapp Kiss: కేరళలో దారుణం జరిగింది. వాట్సప్ మెసేజ్ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇంటిపక్కనుండే స్నేహితుడే తన భార్యపై కన్నేయడంతో తట్టుకోలేక పోయిన వ్యక్తి ఫ్రెండ్ తో పాటు తన భార్యను కూడా హతమార్చాడు. ఇద్దరినీ వెంటాడి వేటాడి నరికి నరికి చంపాడు. ఈ భయంకరమైన ఘటన కేరళలోని పతనం తిట్ట కలంజూరులో చోటుచేసుకోగా స్థానికులంతా ఉలిక్కిపడ్డారు. పోలీసులు సైతం ఆశ్చర్యపోయిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

వైష్ణవి వాట్సాప్​​కు ముద్దు..

పతనంతిట్టలోని కలంజూరుకు చెందిన బైజు (35), వైష్ణవి (28)కి కొంతకాలం క్రితం పెళ్లి అయింది. వారికి 10,5 సంవత్సరాల ఇద్దరు కొడుకులున్నారు. అయితే అదే కాలనీలో తన తల్లితో కలిసి ఉంటున్న వైష్ణవి స్నేహితుడు విష్ణు (30)ని అప్పుడప్పుడు వీరి ఇంటికి వస్తుంటాడు. వైష్ణవితో వాట్సప్ చాటింగ్ కూడా చేస్తుంటాడు. కొంతకాలంగా దీనిని పెద్దగా పట్టించుకోలేదు బైజు. అయితే ఇటీవల విష్ణు ఓ సారి వైష్ణవి వాట్సాప్​​కు ముద్దు ఎమోజీ పంపించాడు. అది అనుకోకుండా  బైజు కంటపడింది. దీంతో వైష్ణవిని నిలదీయగా ఇద్దరమధ్య వివాదం జరిగింది. 

Also Read: Oscar Awards 2025: వేశ్యతో ప్రేమలో పడిన కథ.. 'అనోరా' చిత్రానికి ఏకంగా ఐదు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డు!

స్నానం చేసి బట్టలు మార్చుకుని..

ఈ గొడవలోనే వైష్ణవి ఫ్రెండ్ విష్ణు ఇంటికి వెళ్లింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన బైజు.. కొడవలి పట్టుకుని విష్ణు ఇంటికి వెళ్లాడు. భార్యను బయటకు రమ్మని కేకలు వేసిన ఆమె రాలేదు. విష్ణు ఇంట్లోకి బలవంతంగా చొరబడిన బైజు.. వైష్ణవిని బయటకు లాకెళ్లి కొడవలితో చాలా చోట్ల నరికాడు.  బైజును ఆపడానికి వెళ్లిన విష్ణును కూడా అదే కొడవలితో వేటు వేశాడు. విష్ణు, వైష్ణవి తీవ్రంగా గాయపడగా స్థానికులు  ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. అయితే వారిద్దరిని నరికిన తర్వాత రక్తపు మరకలు కనిపించకుండా బైజు స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు.  ఆ తర్వాత మరో స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పేశాడు. వెంటనే అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బైజును అరెస్ట్ చేశారు. 

Also read :  SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttar Pradesh : టచ్ చేస్తే చచ్చిపోతా.. ఫస్ట్ నైట్ రోజే వరుడికి వధువు షాక్.. చివరికి బిగ్ ట్విస్ట్!

ఉత్తరప్రదేశ్‌లో ఓ వరుడికి మొదటి రాత్రే వధువు షాక్ ఇచ్చింది. శోభనం రాత్రి నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని వరుడికి బెదిరించింది. ఎంత నచ్చజెప్పినా కూడా వధువు వినిపించుకోలేదు. దీంతో వరుడు పోలీసులను ఆశ్రయించాడు.

author-image
By Kusuma
New Update
Marriage

Uttar pradesh

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. పెళ్లి జరిగి కనీసం ఒక రోజు కాకుండానే భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఎంతో పవిత్రమైన పెళ్లిని పెటాకులు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి యువతితో పెళ్లి జరిగింది.

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

పెళ్లికి ముందే ఓ అబ్బాయిని..

కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా పెళ్లి చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. దీంతో మొదటి రాత్రే వధువు చేసిన పనికి వరుడు గజ గజ వణికి పోయాడు. శోభనం గదిలో వధువు వరుడికి ఓ వింత కండిషన్ పెట్టింది. నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని బెదిరించింది. వరుడు ఎంత నచ్చజెప్పిన కూడా వధువు వినిపించు కోలేదు. టచ్ చేయవద్దని బెదిరించింది. 

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

చివరకు వరుడు అడగ్గా.. పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించానని ఇప్పటికీ కూడా అతన్నే ప్రేమిస్తున్నానని, తనే నా భర్త అని తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయి కుటుంబ సభ్యులకు తెలిపాడు. అయితే ఆ వధువు ఏ మాత్రం కూడా వినకపోయే సరికి వరుడు పోలీసులను ఆశ్రయించాడు. వధువుతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

 

marriage | uttar-pradesh | national news in Telugu | today-news-in-telugu | latest-telugu-news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment