Shocking News: మరో మీర్ పేట మర్డర్.. 20 ఏళ్లుగా ఫ్రిజ్ లోనే పుర్రె, అస్థి పంజరం.. ఆ డెడ్ బాడీ ఎవరిది?

ఓ ఇంటి రిఫ్రిజిరేటర్‌లో 20ఏళ్ల కిందటి మానవ పుర్రె, ఎముకలు లభించడం సంచలనం రేపుతోంది. కేరళ చొట్టనిక్కర గ్రామంలోని డాక్టర్ ఫిలిప్ జాన్‌ ఇంట్లో మానవ అవశేషాలు దొరకడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీక్రెట్ మర్డర్స్ కేసుపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. 

New Update
kerala frd

kerala Human skull, bones found in fridge

Kerala: మీర్‌పేట్ ఘటన మరువకముందే మరో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఉలిక్కిపడేలా చేసింది. భార్యను చంపి, 2 రోజులపాటు ఉండికించి, కాల్చి ముక్కలు చేసిన గురుమూర్తి క్రూరత్వాన్ని మించిన కేసు కేరళలో ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటి, రెండు కాదు ఏకంగా 20 ఏళ్లపాటు ఓ ఇంటి రిఫ్రిజిరేటర్‌లో మానపుర్రె, ఎముకలను భద్రంగా దాచిన వార్త జనాలకు భయబ్రాంతులకు గురి చేసింది. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఖాళీగా ఉన్న ఇంట్లో ఈ ఘటన జరగగా దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.  

సంఘ వ్యతిరేక శక్తులకు నిలయం:

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని ఎర్నాకుళం జిల్లా చొట్టనిక్కర ప్రాంతంలోని ఒక ఇంట్లో మానవ పుర్రె, ఎముకలు లభించాయి. ఈ ఇల్లు దాదాపు 20 సంవత్సరాలుగా ఖాళీగా ఉండగా ఇది సంఘ వ్యతిరేక శక్తులకు నిలయంగా మారింది. అయితే స్థానిక సర్పంచ్ ఇందిరా ధర్మరాజ్.. ఆ ఇంట్లో ఏదో జరుగుతున్నట్లు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఇంటిని సోదా చేయగా ఫ్రిజ్ లోపల మూడు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేయబడిన మానవ పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. దీంతో పాటు ఆ ఇంట్లో చాలా మానవ అవశేషాలు దొరికాయి. చాలా కాలంగా ఇక్కడ సీక్రెట్ మర్డర్స్ జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇంటి యజమాని చెబుతుంది నిజమేనా:

ఇందులో భాగంగానే ఇంటి యజమాని 74 ఏళ్ల డాక్టర్ ఫిలిప్ జాన్‌ను పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆయన కేరళ రాష్ట్రంలోని వైట్టిలలో నివసిస్తున్నారు. పోలీసులు సంఘటన గురించి ఆరాతీయగా తన పిల్లలు విదేశాల్లో నివసిస్తున్నారని, ఆ ఇల్లు చాలా సంవత్సరాలుగా ఖాళీగానే ఉంచుతున్నట్లు జాన్ తెలిపారు. అయితే ఆ అవశేషాలు ఇంటికి ఎలా వచ్చాయి? ఇంటి యజమానికి దానితో  ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు సమీప నివాసితులను కూడా విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Illegal Relationship: బయటపడ్డ జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్‌ రాసలీలలు

అవశేషాలకు ఫోరెన్సిక్ పరీక్ష:
పోలీసులు స్వాధీనం చేసుకున్న మానవ అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ఈ దర్యాప్తులో ఆ పుర్రె, ఎముకలు ఎంత పాతవో స్పష్టంగా తెలియనుంది. అయితే ఆ ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉండటం, సంఘ వ్యతిరేక శక్తులు దాన్ని ఉపయోగించడంతో దర్యాప్తు మరింత క్లిష్టంగా మారిందంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే దానిని తమకు అందించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫొటోల మార్ఫింగ్‌పై కేసులు నమోదు!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Khammam Crime: ఖమ్మంలో కసాయి కోడలు.. మామ కంట్లో కారం చల్లి.. ఏం చేసిందంటే!

టీచర్‌గా ఉద్యోగం చేస్తున్న ఓ కోడలు ఆస్తి కోసం మామ కంట్లో కారం చల్లి దాడి చేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. తన ఇద్దరు చెల్లెళ్లతో కోడలు ఆ దాడికి పాల్పడింది. ఆస్తి కోసం గత మూడేళ్ల నుంచి మామను వేధిస్తోంది. వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

New Update
Khammam

Khammam

ఈ మోడ్రన్ ప్రపంచంలో కోడళ్లు కిరాతకంగా మారుతున్నారు. అత్తమామలను కన్న తల్లిదండ్రులుగా చూసుకోకుండా దారుణంగా వారితో ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ కోడలు మామను చూసుకోకుండా దాడికి పాల్పడింది. చదువుకుని టీచర్ ఉద్యోగం చేస్తున్న కోడలు ఆస్తి కోసం కంట్లో కారం చల్లిన దారుణ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

కేవలం ఆస్తి కోసమే..

వివరాల్లోకి వెళ్తే.. ఏన్కూరు మండలం కోనాయపాలెం గ్రామంలో ఉంటున్న ఓ మహిళ ఆస్తి కోసం తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి మామ కంట్లోకి కారం చల్లింది. దీంతో ఆ వృద్ధుడు గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చారు. టీచర్ ఉద్యోగం చేస్తున్న ఈ కోడలు కేవలం ఆస్తి కోసమే ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. మామ నుంచి ఆస్తులు రావాల్సి ఉండటంతో గత మూడేళ్ల నుంచి కోడలు వేధిస్తోంది. దీంతో వృద్ధుడు పోలీసు స్టేషన్‌లో కోడలిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

ఇదిలా ఉండగా విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జరిగింది. చదువు చెప్పాల్సిన గురువే ఓ విద్యార్థిని పాలిట శాపం అయ్యాడు. నైతిక విలువలు నేర్పించాల్సిన గురువు మైమరిచి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని భవానీపురం జోజినగర్‌కు చెందిన పుల్లేటికుర్తి భువనచంద్ర (31) తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ స్కూల్‌లో చదువుతున్న ఓ పదో తరగతి బాలిక స్పెషల్ క్లాస్‌కు వెళ్లింది. ఈ సమయంలో ఉపాధ్యాయుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

దీంతో బాలిక భయపడి.. స్కూలు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఈ జరిమానాలో రూ.10 వేలు, నష్టపరిహారం కింద రూ.3 లక్షలు బాధితురాలికి అందజేయాలని డిస్ట్రిక్ట్‌ లీగల్‌సెల్‌ అథారిటీని న్యాయమూర్తి ఆదేశించారు.

Advertisment
Advertisment
Advertisment