Chidrens murder: స్కూల్ ఫీజుల భారంతోనే పిల్లల హత్య.. సూసైడ్ నోట్‌లో భయంకర విషయాలు!

కాకినాడ పిల్లల మర్డర్ ఘటనలో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. 'అధిక ఫీజులతో ఆందోళన. పెద్దస్కూల్ నుంచి చిన్న స్కూల్లోకి మార్చేశా. వారిస్థాయి తగ్గించేశా. భవిష్యత్తులో లక్షలు కట్టి చదివించగలనా?' అని తండ్రి కిషోర్ సూసైడ్ నోట్‌లో  రాసినట్లు పోలీసులు తెలిపారు. 

New Update
kakinada

Kakinada child murder case Sensational details in kishore suicide note

Chidrens murder: కాకినాడలో జరిగిన హృదయవిదారకర ఘటనలో మరిన్ని నిజాలు బయటపడుతున్నాయి. కన్నతండ్రే కాలయముడై ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలనూ హతమార్చగా దీనిపై అనే సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి జీజీహెచ్‌లో ఇద్దరు చిన్నారులతో పాటు తండ్రి చంద్రకిశోర్ మృతదేహాలకు వైద్యుల పోస్ట్ మార్టం నిర్వహించారు. కిశోర్, జోషిల్, నిఖిల్ మృతదేహాలను తాడేపల్లిగూడెంలోని చంద్రకిషోర్ తండ్రి సూరిబాబు నివాసానికి తీసుకెళ్లారు. దీంతో పాతూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. 

లక్షలు కట్టి పిల్లల్ని చదివించగలనా?

ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకు భవిష్యత్తు లేదనే కారణంతోనే చంపేశాడా? లేక ఇంకేదైనా కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిషోర్ సూసైడ్ నోట్ లో.. 'అధిక ఫీజులతో ఆత్మనూన్యతా భావం మొదలైంది. పెద్దస్కూల్ నుంచి చిన్న స్కూల్లోకి మార్చేశాను. భవిష్యత్తులో లక్షలు కట్టి పిల్లల్ని చదివించగలనా? స్థాయి తగ్గించేశానా?' అని అతను అందులో రాసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ కారణంతోనే ఇలా చేసాడా లేక ఇది కూడా కల్పిమేనా అని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చంద్రకిశోర్ పిల్లలిద్దరి కళ్లకు గంతలు కట్టి, కాళ్లకు తాళ్లు కట్టి, చేతులను వెనక్కి విరిచి కట్టి, నీరు నింపిన బకెట్లలో తలలు ముంచి, ఊపిరాడకుండా చేసి చంపిన తీరు కలవరపాటుకు గురి చేస్తోందని అంటున్నారు.

ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!

అయితే ఒక్కడే బాత్ రూమ్ వరకు తీసుకెళ్లి చంపగలిగాడా? పిల్లలను బకెట్లలోని నీట్లో ముంచే సమయంలో వారు పెద్దగా ఏడుస్తూ అరిచి ఉండవచ్చు. ఆ సమయంలో ఆ కసాయి తండ్రి మనసు మారకుండా ఎలా ఉంది? కళ్ళ ముందు విలవిల కొట్టుకుంటుంటే ఎలా చూడగలిగాడు? అయినా అంత కర్కశంగా ఎలా చేయగలిగాడనే దానిపైనే బంధువులే కాదు పోలీసులను సైతం విస్తుపోయేలా చేస్తోందంటున్నారు. తనకు బాధ ఉంటే తాను ఒక్కడు చనిపోయి ఉండొచ్చు కదా.. అభం శుభం తెలియని పసుకందులను చిదిమేసే హక్కు ఎవరిచ్చారంటూ పలువురు మండిపడుతున్నారు.

Also Read: పాకిస్థాన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై బీఎల్‌ఏ దాడి.. 90 మంది సైనికులు మృతి!

ఇక ఆ సమయంలో కిషోర్ భార్య ఎక్కడకు వెళ్ళింది? నిజంగా తాను పనిచేస్తున్న Ongc హోళీ వేడుకళ్ళోనే వదిలి వచ్చాడా లేక అంతా అబద్ధం చెప్పాడా? అనే కోణంలో ఆలోచిస్తున్నారు. దీనిపై వాస్తవాలు విచారణలో తెలియాల్సి ఉందని, పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. సూసైడ్ నోట్ అధారంగా కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరా.. ఐపిఎస్ వివరాలు వెల్లడించారు. ఈ ఘటనపై పిల్లల్ని చంపినందుకు తండ్రిపై మర్డర్ కేసు, ఆత్మహత్య కేసు రెండు కూడా నమోదు చేసి మరింత లోతుగా విచాణ చేస్తున్నట్లు సర్పవరం సీఐ పెద్దిరాజు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు