/rtv/media/media_files/2025/01/30/LaROTNhrXh7nflWrZnEq.jpg)
it employee Photograph: (it employee)
అతనో ఐటీ కంపెనీలో ఎంప్లాయ్ (IT Employee).. లక్షల్లో జీతం.. బాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. జల్సాలు, షికార్లుకు అలవాటు పడి వచ్చే జీతం సరిపోక అప్పులపాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు బాగా ఒత్తిడి చేయడంతో దొంగగా మారాడు. ఏకంగా తన తోటి ఉద్యోగి ఇంట్లోనే దోపిడీకి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.
Also Read : 15 ఏళ్లుగా లవ్.. విశాల్తో డేటింగ్.. పెళ్లిపై ఓపెన్ అయిన అభినయ!
కడప జిల్లా ఖాజీపేటకు చెందిన కళాహస్తి హరీశ్‌కృష్ణ (35) గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ గాజులరామారంలో ఉంటున్నాడు. ఇతనికి పెళ్లి కూడా అయింది. భార్యతో విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడిపోయిన హరీశ్‌కృష్ణ అప్పులపాలయ్యాడు. దీంతో అవి తీర్చడానికి దొంగతనమే సరైనదిగా భావించాడు. దీంతో తన కంపెనీలో పనిచేసే మణికంఠ ఇంట్లో దొంగతనం చేయాలని ఫిక్స్ అయ్యాడు.
Also Read : కుంభమేళాలో తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
IT Employee Turned Thief
వీరికో వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్ (WhatsApp Group) లో చాటింగ్ ద్వారా మణికంఠ ఇంట్లో లేడనే విషయాన్ని తెలుసుకున్న హరీశ్‌కృష్ణ 2025 జనవరి 25వ తేదీన అతని ఇంటికి దొంగతనానికి వెళ్లాడు. ముసుగు వేసుకుని, హెల్మెట్ ధరించి మాదాపూర్ లోని చంద్రానాయక్‌తండాలో ఉన్న మణికంఠ ఇంట్లోకి చొరబడ్డాడు. అప్పుడు ఇంట్లోనే ఉన్న మణికంఠ భార్యకు కత్తి చూపించి బెదిరింపులకు దిగాడు. ఇంట్లో ఉన్న బంగారం ఇవ్వకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. ఆమె చేతికి గాయం చేసి నగలు తీసుకుని అక్కడి నుంచి హరీశ్‌కృష్ణ పరారయ్యాడు.
Also Read : వీవీఐపీల పాస్ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!
విషయం తెలుసుకున్న మణికంఠ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాట్సాప్ గ్రూప్‌లో ఛాటింగ్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. హరీశ్‌కృష్ణ పై అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైలో విచారణ చేయగా అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. ఓ షాపులో నగలను అమ్మినట్లుగా పోలీసులకు చెప్పాడు. నిందితుడిని అరెస్టు చేసి అతని నుండి 20 గ్రాముల గాజులు, బైకు, కత్తి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొకున్నారు.
Also Read : తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు.. లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే!