Hyderabad Real Estate : షాకింగ్ రేట్లు.. గచ్చిబౌలిలో గజం రూ. 1.76 లక్షలు!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన ప్లాట్ల బహిరంగ వేలంలో గజం ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన ప్లాట్ల బహిరంగ వేలంలో గజం ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
చైనా మాంజాతో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా వాటి అమ్మకాలు, వినియోగం ఆగటం లేదు. ఏకంగా హైకోర్టు చెప్పినా ఆగని చైనా మాంజా విక్రయాలు ఆగకపోవడంతో మరో ముగ్గురు ప్రాణపాయంలో చిక్కుకున్నారు. అమ్మకాలను హైకోర్టు నిషేధించిన నగరంలో విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
రూల్ బుక్ పట్టుకుని, నిష్పక్షపాతంగా వ్యవహరించిన గచ్చిబౌలి ఇన్స్పెక్టర్కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. కేసు నమోదు చేసినందుకు హబీబుల్లాఖాన్‌ను బదిలీ చేయడం సంచలనంగా మారింది.
గండిపేట మండలం వట్టినాగులపల్లిలో సర్వే నం.245/19లో సతీశ్‌షా అనే వ్యక్తికి 3 ఎకరాల స్థలం ఉన్నది. ఆ భూమిలోకి ప్రవేశించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యక్తులు అక్కడి గోశాలను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు కంపెనీపై కేసు నమోదైంది.
గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిన నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గచ్చిబౌలిలో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. రేవ్ పార్టీపై దాడి ఘటనలో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ రైడ్‌లో 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల డ్రగ్ పిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
సినిమాల్లో హీరో కానీ, రియల్ లైఫ్ లో మాత్రం కట్టుకున్న భార్యకే విలన్ గా మారాడు. సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలు, షికార్లకు అలవాటు పడిన హీరో ధర్మ మహేష్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అతని భార్య పోలీసులను ఆశ్రయించింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి మరో ప్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పి. జనార్ధన్ రెడ్డి ( శిల్పా లే ఔట్ రెండో ఫేస్) ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించనున్నారు.