Indian Student: అమెరికా అడవుల్లో భారతీయ విద్యార్థి డెడ్‌బాడీ.. ఆరు రోజులుగా మిస్సింగ్..?

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య (22) మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. కాలిఫోర్నియా యూనివర్సిటీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న సాకేత్, ఫిబ్రవరి 9న అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు.

New Update
Saket Srinivasaiah

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య(Saket Srinivasaiah) (22) మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. కాలిఫోర్నియా యూనివర్సిటీ (బర్కిలీ)లో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న సాకేత్, ఫిబ్రవరి 9న అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. స్నేహితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, యూనివర్సిటీకి కిలోమీటర్ దూరంలోని అటవీ ప్రాంతంలో అతని మృతదేహం దొరికింది.

Also Read :  బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారానికి డేట్ ఫిక్స్.. ఇండియా ప్రధాని మోదీకి ఆహ్వానం

Indian Student Dead Body Found In American Woods

కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన సాకేత్(indian-student), ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్ళాడు. బర్కిలీ హిల్స్‌లోని లేక్ అంజా సమీపంలో అతను చివరిసారిగా కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా అటవీ ప్రాంతంలో సాకేత్‌కు చెందిన పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్ దొరికిన కొద్దిసేపటికే మృతదేహాన్ని(deadbody) కూడా పోలీసులు కనుగొన్నారు.

ఈ ఘటనపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాకేత్ మరణాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ, అతని మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కష్టకాలంలో సాకేత్ కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని రాయబార కార్యాలయం భరోసా ఇచ్చింది. ప్రతిభావంతుడైన ఒక యువ విద్యార్థి ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం ప్రవాస భారతీయుల్లో మరియు అతని స్వగ్రామంలో తీవ్ర విచారాన్ని నింపింది.

Also Read :  ఎన్నికల ఫలితాలపై స్పందించిన తారిక్‌ రెహమాన్.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు