/rtv/media/media_files/2025/02/10/KC3ykJLiJKKwWvP3jcQY.jpg)
Gujarat Three people died after drinking jeera soda
jeera soda: గుజరాత్‌లో దారుణం జరిగింది. ఎండలు మండిపోతుండటంతో సేద తీరేందుకు చల్లటి సోడా తాగిన ముగ్గురు వ్యక్తులు మరణించిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ ఖేడా జిల్లా నదియాద్ నగరంలో ఆదివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు యోగేష్ కుష్వాహా (40), రవీంద్ర రాథోడ్ (50), కనుభాయ్ చౌహాన్ (59) అనుమానాస్పదంగా చనిపోయారు. అయితే వీరు ముగ్గురు జీలకర్ర సోడాతో సహా మద్యం సేవించినట్లు వారి స్నేహితులు తెలిపారు. ఈ కారణంగానే ఆరోగ్య పరిస్థితి విషమించడతో స్నేహితులు నాడియాద్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి అడ్మిట్ అయిన కాపేపటికే చనిపోయారని పోలీసు అధికారి రాజేశ్ గాధియా తెలిపారు.
ఇద్దరి రక్తంలో 0.1 ఇథనాల్..
ఈ ఘటనపై కేసు నమోదు చేసి జీరా సోడా బాటిల్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించినట్లు తెలిపారు. ఆ బాటిళ్లలో ఏముందో తమకు ఖచ్చితంగా తెలియదన్నారు. విచారణలో మాత్రం మృతుల్లో ఇద్దరి రక్తంలో 0.1 ఇథనాల్ ఆల్కహాల్, మరొకరిలో 0.2 ఇథనాల్ ఆల్కహాల్ ఉన్నట్లు రక్త నమూనా పరీక్షల్లో తేలిందన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఘటనపై మరింత స్పష్టత రానుందని చెప్పారు. 2022లో అహ్మదాబాద్, బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 42 మంది కన్నుమూశారు. 2023 డిసెంబర్ లోనూ గుజరాత్ లో ఇలాగే మిథైల్ ఆల్కహాల్ కలిగిన ఆయుర్వేద సిరప్ తాగి 5గురు చనిపోయారు.
ఇది కూడా చదవండి: Rangarajan: రంగరాజన్‌పై దాడిని ఖండించిన మంత్రి కొండా సురేఖ.. వారిపై ఫైర్!
న్యాయం కోసం వెళ్తే కడుపు చేసిన లాయర్..
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. విడాకుల కోసం లాయర్(Lawyer) దగ్గరికి వెళ్తే న్యాయం చేయాల్సింది పోయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి కడపు చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ కు చెందిన బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం భద్రాధ్రికొత్తగూడెం జిల్లాకు చెందిన ఓవ్యక్తితో యువతికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన భర్త తరచూ తాగి వేధింపులకు గురిచేస్తుండటంతో భర్తతో వివాహబంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది. భర్త నుంచి విడాకులు కోసం భధ్రాచలంకు చెందిన యువ న్యాయవాది భరణి వెంకట కార్తీక్ ను సంప్రదించింది. ఆ యువతి కేసును స్వీకరించిన వెంకటకార్తీక్ కొద్ధికాలం భర్తకు దూరంగా ఉండాలని యువతికి సూచించాడు.
ఇది కూడా చదవండి: B.ed: బీఈడీ చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. ఇకనుంచి ఒక ఏడాదే కోర్సు
లాయర్ సూచనతో తన కుమారుడితో కలిసి ఆ యువతి అద్దె ఇంట్లో ఒంటరి జీవనం సాగించింది. కేసు విషయమై మరోసారి లాయర్ కార్తీక్‌ను సంప్రదించింది. డైవర్స్ విషయం తాను చూసుకుంటానని తన కామవాంఛ తీర్చాలంటూ కార్తీక్ ఆ యువతిని కోరాడు. అంతటితో ఆగకుండా ప్రేమిస్తున్నానంటూ.. పెళ్లికూడా చేసుకుంటానంటూ యువతి వెంటపడ్డాడు. యువతి బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని లాయర్ ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చగా న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది.