Rape: గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్.. టీచర్లే కిడ్నాప్ చేసి దారుణం!?

ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. మాడుగులలోని ఓ గిరిజన పాఠశాలకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడి చేశారు. పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి మిగతా ఇద్దరికోసం గాలిస్తున్నారు. టీచర్లే ఇదంతా చేశారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. 

New Update

Gang Rape: ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. కామాంధుల చేతిలో మరో బాలిక బలైంది. అల్లూరి జిల్లా మాడుగుల మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన అమ్మాయిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది. క్రిస్టమస్ పండుగ సందర్భంగా సెలవులపై ఇంటికెళ్లి హాస్టల్ కు వచ్చిన అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు ఆటోలో ఎక్కించుకుని వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాధితురాలు చెప్పడంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

25 నుంచి 28 వరకూ.. 

ఈ మేరకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలిక ఈ నెల 25న కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులకు విషయం తెలియగానే 28 తేదిన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే యాక్షన్ మొదలుపెట్టిన పోలీసులు 28న సాయంత్రం పాడేరులో బాధితురాలిని గుర్తించి స్టేషన్ తీసుకొచ్చారు. 

మాయమాటలు చెప్పి నమ్మించి..

ఈ క్రమంలో ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జి.మాడుగుల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన కొర్రా మల్లీశ్వరరావు(22), వంతాల సన్యాసిరావు(24), మరో 16 ఏళ్ల అబ్బాయి తనకు మాయమాటలు చెప్పి పాడేరు తీసుకెళ్లినట్లు బాలిక చెప్పింది. అక్కడ ఆ ముగ్గురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన చెందింది. ఇక బాధితురాలిని పేరెంట్స్ కు అప్పగించిన పోలీసులు.. ఆ ముగ్గురు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వంతాల సన్యాసిరావును అదుపులోకి తీసుకోగా మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సీఐ బి.శ్రీనివాస్‌ చెప్పారు. మరోవైప టీచర్ల ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి

పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.  

New Update
HP accident

HP accident

పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.  

తమ్ముడి వివాహం అయిపోయాక 

మృతులను చాచియోట్ తహసీల్‌లోని తరౌర్ గ్రామానికి చెందిన రమేష్ చంద్ కుమారుడు దునిచంద్ (33), తరౌర్ గ్రామానికి చెందిన దునిచంద్ భార్య కాంతా దేవి (28), వారి కుమార్తె కింజల్ (8 నెలలు), చాచియోట్ తహసీల్‌లోని నౌన్ గ్రామానికి చెందిన థాలియా రామ్ కుమారుడు దహ్లు రామ్ (52), నేపాల్ నివాసి మీనా దేవి (30)గా గుర్తించారు. దునిచాంద్ తమ్ముడి వివాహం అయిపోయిన తరువాత కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.  

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పాండో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం, SDRF, CISF, పాండో అవుట్‌పోస్ట్ బృందాలు మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాయి

Advertisment
Advertisment
Advertisment