/rtv/media/media_files/2025/01/15/F005cioxrxO1zvRsaayj.jpg)
father shot Photograph: (father shot)
నాలుగు రోజుల్లో కూతురి పెళ్లి ఉండగా.. తండ్రి ఆమెను గన్‌తో కాల్చాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మహేష్ గుర్జార్ అనే వ్యక్తి తన 20 ఏళ్ల కుమార్తెను పోలీసు అధికారుల ముందే కాల్చి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఈ హత్య గ్వాలియర్ లోని గోలా కా మందిర్‌లో మంగళవారం జరిగింది. తనూ గుర్జార్ కుటుంబ పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టంలేదని వ్యతిరేకిస్తూ, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది. కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
తనూ గుర్జార్ ఫ్యామిలీ ఆమెకు ఇష్టంలేని వ్యక్తితో పెళ్లి చేయాలని చూస్తుందని ఓ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను విక్కీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా కుటుంబం ఫస్ట్ అతన్ని అంగీకరించింది, కానీ తరువాత ఆ పెళ్లి క్యాన్సల్ చేసింది. తండ్రి చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నన్ను రోజూ కొట్టాతూ.. చంపేస్తామని బెదిరించారు. నాకు ఏదైనా జరిగితే, నా కుటుంబం బాధ్యత వహిస్తుందిని తనూ వీడియోలో చెప్పింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన విక్కీ అనే యువకుడితో తనూ ఆరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉంది. ఆమె అతన్నే వివాహం చేసుంటానని పట్టుబట్టింది. ఆ వీడియో ఆమె తండ్రి మహేష్ గుర్జార్ కి చేరింది.
ఇది కూడా చదవండి :కిడ్నాప్ కేసు విషాదాంతం.. శవమై తేలిన సంజయ్, గ్రామస్థుల ఆందోళన
వీడియో వైరల్ అయ్యాక.. తండ్రి, కూతుళ్ల మధ్య వివాదాలు మరింత పెరిగాయి. కాంప్రమైస్ కోసం సూపరింటెండెంట్ ధర్మవీర్ సింగ్‌తోపాటు పోలీసు అధికారులు మహేష్ గుర్జార్‌ను తీసుకొని తనూ ఇంటికివెళ్లారు. కుల పెద్దల సంఘం కూడా పంచాయితీకి వచ్చారు. సమస్యను పరిష్కరించడానికి అందరూ ప్రయత్నించారు. తండ్రి పెట్టిన చిత్రహింసలు, ఆమె సేఫ్టీ గురించి వన్ స్టాప్ సెంటర్‌కు వెళ్లతానని యువతి చెప్పింది.
అందరూ మాట్లాడుకుంటుండగా.. మహేశ్ గుర్జార్ కూతురితో ఏకాంతంగా మాట్లాడాలని కుల పెద్దలను బయటకు పంపించాడు. తనూని ఆమె తండ్రి చాలా చేపు ఒప్పించడానికి ప్రయత్నించాడు. ఎంతకూ ఆమె వినలేదు. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి మహేష్ గుర్జార్ తనతోపాటు తెచ్చకున్న కంట్రీ మేయిడ్ గన్‌తో కుమార్తె ఛాతిపై కాల్చాడు. తనూ నుదిటి, మెడ, కన్నుపై గన్‌తో కాల్చడంతో ఆమె చనిపోయింది. అదే గన్‌తో బెదిరించి యువతి తండ్రి తప్పించుకోవాలని చూశాడు. కానీ అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. జనవరి 18న జరగాల్సిన తనూ పెళ్లి.. ఇష్టంలేని పెళ్లి వివాదంతో ఆమె చావుకు కారణమైంది.