/rtv/media/media_files/2024/10/27/O9uhGLkSG34T8NdiZp6S.jpg)
Cyber Crime
Cyber Crime: ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు పెట్టిన సైబర్ కేటుగాళ్ల దోపిడి ఆగడంలేదు. వివిధ రూపాల్లో అమాయకులనే కాదు తెలివైన వారిని సైతం బురిడికొట్టిస్తున్నారు. ఇటీవల టెకీలను టార్గెట్ చేస్తూ డిజిటల్ అరెస్టులతో దండిగా దోచేస్తున్న మాయగాళ్లు తాజాగా ఓ మొబైల్ ఫోన్ గిఫ్టుగా పంపి ఊహించని షాక్ ఇచ్చారు. కొత్త సిమ్ తీసుకున్నందుకు మొబైల్ ఫోన్ లాటరీ తగిలిందని నమ్మించి ఖాతా ఖాళీ చేసిన ఘటన బెంగళూర్‌లో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
న్యూ సిమ్ కార్డుపై కొత్త మొబైల్ ఫోన్..
ఈ మేరకు బెంగళూరు నగరానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కొత్త సిమ్ కార్డు కొన్నాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన దుండగులు.. న్యూ సిమ్ కార్డుపై కొత్త మొబైల్ ఫోన్ గెలుచుకున్నారని కాల్ చేసి చెప్పి అతని అడ్రస్ కు పంపించారు. ఆ ఆనందంలో పెద్దగా ఆలోచించని టెకీ.. కొత్త ఫోన్ లో సిమ్ వేసుకున్నాడు. దీంతో అతను సిమ్ వేసిన గంట తర్వాత ఆ ఫోన్‌కు మెసేజ్, ఓటీపీలు రావడం మొదలయ్యాయి.
అయితే కొత్త ఫోన్ కావడంతో ఇలాగే వస్తాయని పెద్దగా పట్టించుకోలేదు సదరు వ్యక్తి. దీంతో స్కామర్ల తన ఖాతాను ఖాళీ చేశారు. యాప్‌లకు తమకు నచ్చిన ఓటీపీలు పెట్టి ఫోన్ పంపిన దుండగులు.. అతని ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లను దోచేశారు. చివరికి ఈ విషయం గుర్తించిన బాధితుడు ఆఘమేఘాలపై వైట్ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: IPL 2025: నా 140Km వేగం ఎవరికి కనిపించలేదేమో.. ఉమేష్ షాకింగ్ కామెంట్స్!