/rtv/media/media_files/2025/02/26/s2ToXR62clAyPy6yXrzU.jpg)
conistable sucide Photograph: (conistable sucide)
Constable suicide: మరో పదిరోజుల్లో పెళ్లి పీటలెక్కి మెడలో మూడుముళ్లు వేయించుకోవాల్సిన యువతి తన మెడకు ఉరితాడు బిగించుకుంది. ఎంతోకష్టపడి నచ్చిన ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్న ఆమె పట్టుమని పదేళ్లు కూడా పనిచేయకుండానే తనువు చాలించడం సంచలనం రేపుతోంది. తనలాంటి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలవాల్సిన కానిస్టేబుల్ బలవర్మరణానికి పాల్పడటంతో డిపార్ట్ మెంట్, బంధువులు, గ్రామస్థులంతా ఉలిక్కిపడ్డారు. ఈ ఘనట భువనగిరిలో చోటుచేసుగా వివరాలు ఇలా ఉన్నాయి.
ఇద్దరికి ఒకేసారి కొలువు..
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామానికి చెందిన మామిడాల లక్ష్మయ్య గౌడ్ చిన్న కొడుకు, కూతురుకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కొడుకు కిరణ్ హైదరాబాదులో సివిల్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా కూతురు అనూష (28) యాదాద్రి జిల్లా భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే కూతురు ఉద్యోగ రిత్యా కుటుంబం మొత్తం భువనగిరిలో నివాసం ఉంటున్నారు.
Also Read: CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
మార్చి 6న పెళ్లి..
అయితే అనూషకు ఇటీవలే పెళ్లి సంబంధం కుదిరింది. మార్చి 6న పెళ్లి మూహూర్తాలు కూడా పెట్టుకున్నారు. కానీ ఉన్నట్టుండి మంగళవారం అనూష తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోవడం కలకలం రేపింది. తన కూతురు ఇలా ఎందుకు చేసిందో అర్థంకాక తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటనతో వరికోలు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనూష మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు భువనగిరి ఎస్సై తెలిపారు.
Also Read: మహా శివరాత్రి నాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే.. పుణ్యమే