TG: తెలంగాణలో మరో దారుణం.. వేరే వ్యక్తితో పొలాల్లో కనిపించిన తల్లి.. చూసి తట్టుకోలేక కొడుకు ఏం చేశాడంటే!?

భద్రాధ్రికొత్తగూడెం జిల్లా నిమ్మలగూడెం బండి సుజాత డెత్ మిస్టరీని పోలీసులు ఛేధించారు. సుజాత అదే గ్రామానికి చెందిన ప్రభాకర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమె కొడుకు పవన్ గొంతుకు తాడి బిగించి చంపినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేశారు. 

New Update
suicide

Bhadradrikottagudem Sujatha death mystery solved Police

TG News: భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో ఇటీవల జరిగిన మిస్టరీ డెత్ కేసును పోలీసులు ఛేధించారు. జనవరి 25న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బండి సుజాత (40)ను కన్నకొడుకే హత్యచేసినట్లు సుజాతనగర్  పోలీసులు నిర్ధారించారు. మృతురాలు సుజాత మెడ భాగం కమిలినట్లు గుర్తించిన పోలీసు బృందం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే మెడ భాగంలో గాయాలుండటంతో ఊపిరి ఆడక మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడవగా కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు భయంకరనిజాలు బయటపెట్టారు. 

పందెం కోళ్ల తాడుతో గొంతు బిగించి.. 

ఈ మేరకు నిమ్మలగూడెం గ్రామస్థులతోపాటు సుజాత కుటుంబ సభ్యులను పలుకోణాల్లో విచారించారు పోలీసులు. బండిసుజాత తనయుడు బండి పవన్‌పై మొదటినుంచే అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా అసలు నిజం కక్కేశాడు. పందెం కోళ్ల తాడుతో తన తల్లిసుజాత గొంతుబిగించి హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆమె చనిపోయిన తర్వాత తనకేం తెలియదన్నట్లు ప్రవర్తించానని, తల్లి మరణం సహాజంగా లేదా ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందని అందరినీ నమ్మించాలని చూసినట్లు పవన్ తెలిపాడు. 

ఇది కూడా చదవండి: ICC Rankings : నక్కతోక తొక్కాడు.. టాప్‌-5లోకి వరుణ్ చక్రవర్తి

అయితే తన తల్లి సుజాతను చంపేందుకు బలమైన కారణం ఉందన్నాడు. తమ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తితో తన తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందని పోలీసుల విచారణలో బయటపెట్టాడు. ఈ నెల 25న ఇంటి ఆరుబయట సమీప పొలంలో తనతల్లి ప్రభాకర్ అనే వ్యక్తితో ఉండటాన్ని చూసి కోపోద్రిక్తుడైన పవన్.. ప్రభాకర్ పై దాడిచేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన తల్లి సుజాతను కోపంలోనే తాడుతో గొంతు బిగించి హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు పవన్ ను రిమాండ్ కు తరలించిన పోలీసులు.. ఈ కేసును 72 గంటల్లో చేధించినట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: వరంగల్లో పాక్ ఉగ్రవాదుల కలకలం.. బిర్యానీ సెంటర్ నడుపుతూ..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Roller Coaster Accident : మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఓ యువతి రోలర్ కోస్టర్ ప్రమాదంలో మరణించింది. ఇంతకు ఏం జరిగిదంటే..  24 ఏళ్ల ప్రియాంకకు నిఖిల్ అనే వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. జనవరిలో వీరి ఎంగేజ్ మెంట్ కూడా అయింది.

New Update
women died husband

women died husband

దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది.  మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఓ యువతి రోలర్ కోస్టర్ ప్రమాదంలో మరణించింది. ఇంతకు ఏం జరిగిదంటే..  24 ఏళ్ల ప్రియాంకకు నిఖిల్ అనే వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. జనవరిలో వీరి ఎంగేజ్ మెంట్ కూడా అయింది.  మరికొన్ని నెలల్లో వారికి పెళ్లి జరిగాల్సి ఉంది. అయితే ఇద్దరు కలిసి నైరుతి ఢిల్లీలోని కపాషెరా సమీపంలోని వాటర్ అండ్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు వెళ్లింది. 

Also read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

రోలర్ కోస్టర్ స్టాండు విరిగిపోయి

పాపం అక్కడే వారి జీవితం మలుపు తిరిగింది. అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఇద్దరు రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. బాగా ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగిపోయింది. దీంతో, ప్రియాంక ఎత్తులో నుంచి కింద పడిపోయింది. దీంతో వెంటనే నిఖిల్ ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. అయితే అప్పటికే ప్రియాంక చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు.  ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ఈఎన్‌టీ రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు అయినట్టు వైద్యులు వెల్లడించారు. 

Also read :  Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్‌ లల్లాకు సూర్య తిలకం

కాబోయే భార్యతో లైఫ్ లాంగ్ ఉండాలని ఎన్నో కలలు కన్న నిఖిల్.. ప్రియాంక తన కళ్లముందే చనిపోవడం చూసి కన్నీటిపర్యంతమయ్యాడు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రియాంక మృతి ఘటన ఇరు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిందనే చెప్పాలి. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ప్రమాదంపై అమ్యూజ్‌మెంట్ పార్క్‌ ఇంకా ఎలాంటి ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

Also read : Watch Video: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు