Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు!

బెంగళూరులో ఓ టీచర్ దారుణానికి పాల్పడింది. విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని డబ్బులకోసం బ్లాక్ మెయిల్ చేసింది. మొదట 6 లక్షలు వసూల్ చేసి మరో 20 లక్షలు కావాలంటూ వేధించింది. బాధితుడి ఫిర్యాదుతో శ్రీదేవిని అరెస్ట్ చేశారు. 

author-image
By srinivas
New Update
honey-trap teacher

honey-trap teacher

Teacher crime: ఓ కిలాడీ లేడీ టీచర్ తన అందాలతో వలపుల వల విసిరి విద్యార్థి తండ్రి నిండా ముంచేసింది. అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని కొంతకాలానికి బ్లాక్ మెయిల్ కు పాల్పడింది. సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ చేస్తానంటూ బెదిరించి లక్షల్లో  వసూల్ చేసింది. రోజు రోజుకు ఆమె వేధింపులకు ఎక్కువకావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేయగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

చాటింగ్, వీడియో కాల్స్ చూపించి..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‎కు చెందిన ఓ వ్యాపారి భార్య ముగ్గురు పిల్లలతో వెస్ట్ బెంగళూరులో ఉంటున్నాడు. పిల్లలను ఇంటికి దగ్గర్లోని ఓ ప్రీ ప్రైమరీ స్కూల్లో చదివిస్తున్నాడు. అయితే అడ్మిషన్ సమయంలో ఆ స్కూల్ టీచర్ శ్రీదేవి రుడాగి (25)తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం చాటింగ్, వీడియో కాల్స్ చేసుకున్నారు. అదికాస్త అక్రమ సంబంధానికి దారి తీయగా కొంతకాలం ఎంజాయ్ చేశారు. 

Also Read: Allu Arjun: ఇకపై మారనున్న అల్లు అర్జున్ పేరు? కొత్త పేరు ఏంటంటే

అయితే ఇటీవల శ్రీదేవి తనలోని అసలు రూపం బయటపెట్టింది. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటో, వీడియోలు అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ మొదలుపెట్టింది. మొదట రూ.4 లక్షలు వసూలు చేసిన ఆమె.. తర్వాత మరో రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. వేధింపులు తట్టుకోలేక తన కుటుంబాన్ని గుజరాత్‌కు మార్చాలని ప్లాన్ చేశాడు. ఇంతలోనే విషయం తెలుసుకున్న టీచర్ మరో ఇద్దరితో కలిసి రూ.20 లక్షలకు ఇవ్వాలని బెదిరించింది. భయంతో 1.9 లక్షలు ఇచ్చి మిగిలినవి తర్వాత ఇస్తానన్నాడు. కానీ ఆమె వినకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఆమెపై కేసు నమోదు చేసి ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. 

Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!

illicit-relationship | student | father | bengalore | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bomb threat : హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు.. జడ్జికి ఫోన్ చేసి బెదిరింపు

హనుమకొండ జిల్లా కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేశాడు. జిల్లా కోర్టులో బాంబు పెట్టామని జడ్జికి కాల్ చేసి మరీ బెదిరించాడు. వెంటనే జిల్లాకోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్క్వాడ్ టీంతో పాటు అక్కడికి చేరుకున్నారు.

New Update
Hanumakonda District Court

Hanumakonda District Court

హనుమకొండ జిల్లాలోని కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేశాడు. జిల్లా కోర్టులో బాంబు పెట్టామని జడ్జికి కాల్ చేసి మరీ చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన హనుమకొండ జిల్లా కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాంబు స్క్వాడ్ టీంతో పాటు అక్కడికి చేరుకున్నారు. హనుమకొండ కోర్టులోపల ఉన్నవారిని బయటకు పంపించారు. అనుమానస్ప ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ టీం తనిఖీలు చేస్తోంది. పోలీసు జాగిలాలతోో కోర్టు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫోన్ చేసిన నెంబర్ ఎవరిదని ఎంక్వైరీ చేస్తున్నారు. కోర్టులో నిజంగానే బాంబు ఉందా.. లేక బెందిరించాలని తమాషాకి అతను కాల్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment